ITBP Recruitment of GD Constable: ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ - ITBP) స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 133 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి (మెట్రిక్యులేషన్‌) లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 4న ప్రారంభం కాగా, ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. ఇవి స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు. 

విభాగాలు: అథ్లెటిక్‌, స్విమ్మింగ్‌, షూటింగ్‌, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, టైక్వాండో, ఆర్చరి, జిమ్నాస్టిక్స్‌, కబడ్డి, ఐస్‌హాకీ, హాకీ, ఫుడ్‌బాల్‌, గుర్రపు స్వారీ, కాయాకింగ్‌, రోయింగ్‌, వాలీబాల్‌, జూడో, రెజ్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, ఐస్‌ స్కీయింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌, ఖోఖో, సైక్లింగ్‌, యోగాసన, పెన్కాక్‌ సిలాట్‌, బాస్కెట్‌బాల్‌.


వివరాలు..


ఖాళీల  సంఖ్య: 133 (పురుషులు- 70,మహిళలు- 63)


 ⏩ అథ్లెటిక్‌: 25
పురుషులు: 11
మహిళలు: 14


⏩ స్విమ్మింగ్‌: 07
పురుషులు: 07


⏩ షూటింగ్‌: 02
పురుషులు: 01
మహిళలు: 01


⏩ బాక్సింగ్‌: 05
పురుషులు: 03
మహిళలు: 02


⏩ వెయిట్‌లిఫ్టింగ్‌: 07
పురుషులు: 03
మహిళలు: 04


⏩ టైక్వాండో: 05
పురుషులు: 01
మహిళలు: 04


⏩ ఆర్చరి: 06
పురుషులు: 02
మహిళలు: 04


⏩ జిమ్నాస్టిక్స్‌: 06
పురుషులు: 02
మహిళలు: 04


⏩ కబడ్డి: 01
మహిళలు: 01


⏩ ఐస్‌హాకీ: 04
మహిళలు: 04


⏩ హాకీ: 01
పురుషులు: 01


⏩ ఫుడ్‌బాల్‌: 01
 పురుషులు: 01


⏩ గుర్రపు స్వారీ: 01
 పురుషులు: 01


⏩ కాయాకింగ్‌: 05
పురుషులు: 02
మహిళలు: 03


⏩ రోయింగ్‌: 06
పురుషులు: 02
మహిళలు: 04


⏩ వాలీబాల్‌: 01
పురుషులు: 01


⏩ జూడో: 02
పురుషులు: 01
మహిళలు: 01


⏩ రెజ్లింగ్‌: 02 
పురుషులు: 01
మహిళలు: 01


⏩ హ్యాండ్‌బాల్‌: 01
పురుషులు: 01


⏩ ఐస్‌ స్కీయింగ్‌: 02 
పురుషులు: 01
మహిళలు: 01


⏩ పవర్‌ లిఫ్టింగ్‌: 01 
పురుషులు: 01


⏩ ఖోఖో: 10
పురుషులు: 05
మహిళలు: 05


⏩ సైక్లింగ్‌: 14
 పురుషులు: 14


⏩ యోగాసన: 06
పురుషులు: 03
మహిళలు: 03


⏩ పెన్కాక్‌ సిలాట్‌: 01
 పురుషులు: 01


⏩ బాస్కెట్‌బాల్‌: 01
పురుషులు: 01


అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి (మెట్రిక్యులేషన్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బహుమతి గెలిచి ఉండాలి.


వయోపరిమితి: 03.04.2025 నాటికి 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, 


దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మిగతా వారు రూ.100 చెల్లించాలి. 


దరఖాస్తు విదానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విదానం: 03.04.2025 నుంచి 02.04.2025 వరకు జరిగిన పారా-4(డి) క్రీడల్లో పథకాలు పొంది ఉండాలి. అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు


బేసిక్‌ పే స్కేల్: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.03.2025.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.04.2025.


Notification 


Website 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...