Amazon to cut 30000 white collar jobs :  ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్, తన కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లోని సుమారు 10 శాతం మందిని  తొలగించాలని నిర్ణయించింది.  ఇది మొత్తం 30,000 వైట్-కాలర్  కార్పొరేట్ ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ 28న అమెజాన్ CEO ఆండీ జాస్సీ   మొదటి దశలో 14,000 ఉద్యోగాలు తొలగించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వ్యాపారాన్ని 'లీనర్' చేయడానికి, అధిక ఖర్చులను తగ్గించడానికి, మరింత ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెట్టుబడులకు దోహదపడటానికి తీసుకున్న చర్యగా చెప్పుకున్నారు.    ఈ లేఅవ్‌లు అమెజాన్ చరిత్రలో అతిపెద్దవి.  

Continues below advertisement

పది శాతం వైట్ కాలర్ జాబ్స్ ను తగ్గిస్తున్న అమెజాన్ అమెజాన్ అధికారికంగా అక్టోబర్ 28న తన కార్పొరేట్ ఉద్యోగులకు మెమో పంపి, మొదటి దశలో 14,000 పదాలను తొలగించనున్నట్లు తెలిపింది. ఇది కంపెనీ కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లోని సుమారు 3%కి సమానం. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం, మొత్తం ప్రణాళికలో 30,000 ఉద్యోగాలు  తొలగిస్తారు.  ఈ కట్స్ ప్రధానంగా మార్కెటింగ్, సేల్స్, HR, ఫైనాన్స్ వంటి విభాగాల్లో ఉంటాయి.  అమెజాన్  వెబ్ సర్వీసెస్ (AWS) లేదా ఈ-కామర్స్ ఆపరేషన్లు ప్రభావితం కావు.  AI , మెషిన్ లెర్నింగ్‌లో పెద్ద పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని అమెజాన్ చెబుతోంది. .  

ఏఐ, మెషిన్ లెర్నింగ్లో అమెజాన్ భారీ పెట్టుబడులు  అమెజాన్ AIలో భారీ పెట్టుబడులు పెడుతోంది. 2025లో   $100 బిలియన్లు అంటే సుమారు ₹8.4 లక్షల కోట్లు  AI , మెషిన్ లెర్నింగ్‌లో ఖర్చు చేస్తామని  ప్రకటించింది. ఇది AWS క్లౌడ్ సర్వీస్‌లలో AI టూల్స్, రోబోటిక్స్, ఆటోమేటెడ్ వేర్‌హౌస్ ఆపరేషన్లకు ఉపయోగపడుతుంది. కానీ, వైట్-కాలర్ రోల్స్‌లో AI ఆటోమేషన్   వల్ల ఉద్యోగాలు తగ్గుతున్నాయి. అమెజాన్ AIతో హై-పెయిడ్ వైట్-కాలర్ వర్కర్లను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లేఅవ్‌లు అమెజాన్‌లోని 1.5 మిలియన్ వర్క్‌ఫోర్స్‌లో 2%కి పరిమితం, కానీ కార్పొరేట్ సెక్టర్‌లో తీవ్ర ప్రభావం చూపుతాయి.  టార్గెట్, నెస్లే వంటి కంపెనీలు కూడా AI పుష్‌తో ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఓరాకిల్, డ్రాప్‌బాక్స్, బ్లాక్ వంటివి AI కారణంగా లేఅఫ్ లు ప్రకటించాయి.          

Continues below advertisement

ఓ రంగంలో ఉద్యోగాలు పోయినా మరో రంగంలో సృష్టి               

ఏఐని వినియోగించి వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నవారి పనుల్ని రీప్లేస్ చేస్తున్నప్పటికీ.. ఆయా కంపెనీలు ఇతర విభాగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అమెజాన్ ఏఐ , మెషిన్ లెర్నింగ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయని అంటున్నారు. అంటే ఓ రంగంలో ఏఐని ఉపయోగించినా.. మరో రంగంలో ఉద్యోగాలు సృష్టిస్తున్నారని జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గవని దీని ద్వారా నిరూపితం అవుతోందని..కానీ స్కిల్స్ లేని వారికి .. వాటిని పెంచుకోని వారికి కొత్త అవకాశాలు రావడం కష్టంగా మారుతోందని చెబుతున్నారు.  అందుకే లే ఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీలు..  ఉద్యోగం పోగొట్టుకుంటున్న వారికి స్కిల్స్ పెంచుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి.