Amazon Is Laying Off 14000 People Despite Making 18 Billion Profits : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన కార్పొరేట్ ఉద్యోగులలో 4 శాతం అంటే సుమారు 14,000 మందిని తొలగిస్తున్నామని అక్టోబర్ చివర్లో ప్రకటించింది. ఈ లేఅఫ్స్ , కంపెనీలోని వైట్-కాలర్ వర్క్‌ఫోర్స్‌లో చాలా వరకూ తగ్గుదల నమోదు చేస్తుంది. హాలిడే సీజన్ ముగిసిన తర్వాత జనవరి 2026లో మరిన్ని ఉద్యోగ తీసివేతలు జరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం, కంపెనీ తాజా క్వార్టర్‌లో 18 బిలియన్ డాలర్ల ప్రాఫిట్ సాధించినప్పటికీ జరుగుతుండటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోందది. భారత్‌లోని 1,000 మంది ఉద్యోగుల్ని తొలగించవచ్చని చెబుతున్నారు.
అక్టోబర్ 27న, అమెజాన్ HR ఎగ్జిక్యూటివ్ బెత్ గలెట్టి ఉద్యోగులకు ఈమెయిల్ పంపి, "బ్యూరోక్రసీ తగ్గించడం, లేయర్లు తొలగించడం, కస్టమర్ల అవసరాలకు ముఖ్యమైన పెట్టుబడులకు రీసోర్సెస్ షిఫ్ట్ చేయడం" ద్వారా కంపెనీని "మరింత బలోపేతం చేయడం" లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కట్‌లు, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ, HR , గ్లోబల్ టీమ్‌లను ప్రభావితం చేస్తున్నాయి, ముఖ్యంగా AWS, ప్రైమ్ వీడియో, ట్విచ్ వంటి డివిజన్లలో. ఇది 2022-2023లో 27,000 మంది తొలగించిన తర్వాత అమెజాన్‌లో అతిపెద్ద లేఆఫ్స్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
కంపెనీ Q2 2025లో 167 బిలియన్ డాలర్ల రెవెన్యూ, 18 బిలియన్ డాలర్ల ప్రాఫిట్ సాధించించినట్లుగా ప్రకటించింది. అమెజాన్ 120 బిలియన్ డాలర్లు AI డేటా సెంటర్లు, జెనరేటివ్ AI టూల్స్‌పై ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తోంది. "AI ఇంటిగ్రేషన్‌కు ఉద్యోగులు అడాప్ట్ అవ్వాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి" అని కంపెనీ సీఈవో స్పష్టం చేశారు. చెప్పారు. రాయిటర్స్ ప్రకారం, మొత్తం 30,000వరకు ఉద్యోగులను తీసేస్తున్నారు. భారత్‌లోని 350,000 కార్పొరేట్ ఉద్యోగుల్లో 1,000 మందిని తీసేస్తారని అంచనా. ఉద్యోగులు టార్గెట్లు అధిగమించినా.. , పెర్ఫార్మెన్స్ రివ్యూలు పాజిటివ్ గా ఉన్నా.. AI ఆటోమేషన్ వల్ల ఆమె రోల్ 'రెడండెంట్' అయిందని ఈమెయిల్ వచ్చిందంటే జాబ్ పోయినట్లే.అమెజాన్ వర్కర్స్ యూనియన్ (AWU), "18 బిలియన్ ప్రాఫిట్‌తో 14,000 మందిని తొలగించడం టెక్ రంగంలో భయాన్ని వ్యాప్తి చేస్తోంది" అని విమర్శించింది. ఏఐ వల్ల వెల్-పెర్ఫార్మింగ్ టీమ్‌లు కూడా టార్గెట్ అవుతున్నాయి. AI స్కిల్స్ లేకపోతే రిస్క్ అని చెబుతున్నారు.