Vizag Steel Plant employees :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి.  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్లాంట్ నష్టాలకు కార్మికులే కారణమని, కేంద్రం నుంచి 12 వేల కోట్లు, రాష్ట్రానికి రావలసిన విద్యుత్-నీటి  బకాయిలను ఈక్విటీగా తీసుకున్నా లాభాలు రావడం లేదని విమర్శించారు. "ప్రైవేటు పరిశ్రమలు లాభాల్లో ఉంటుంటే వైజాగ్ మాత్రమే ఎందుకు నష్టాల్లో? ప్రజల సొమ్మును తెల్ల ఏనుగుడిలా మార్చమంటారా?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను కార్మిక సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్రంగా ఖండించడాయి. 

Continues below advertisement

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పని చేయడం లేదన్న సీఎం 

నవంబర్ 15న విశాఖలో జరిగిన CII సమ్మిట్‌ ముగింపు ప్రెస్‌మీట్‌లో  స్టీల్ ప్లాంట్ పై ప్రశ్నలుక స్పందించారు.  "ఇంట్లో పడుకుని పని చేయకుండా జీతాలు తీసుకోవచ్చా? కేంద్రం, రాష్ట్రం ఎప్పటికీ సాయం చేస్తాయా? ప్రభుత్వం ఎంతవరకు భారం భరిస్తుందో కార్మికులు ఆలోచించాలి" అని చెప్పారు. ప్లాంట్‌ను "తెల్ల ఏనుగు"  గా పిలిచారు.  ప్రైవేటు సెక్టర్‌లా లాభాలు సాధించాలని సూచించారు. ఎన్ని వేల కోట్లు ఇస్తున్నా ఇంకా నష్టాల్లో ఉందంటే కారణం ఏమిటని ప్రశ్నించారు.   

Continues below advertisement

చంద్రబాబు వ్యాఖ్యలపై ఉద్యోగుల విమర్శలు

వైజాగ్ స్టీల్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించింది.  "మేము పని చేస్తున్నాం, జీతాలు తీసుకుంటున్నామని అన్నారు.   రా మెటీరియల్, మెషినరీ, పాలసీల వల్లే నష్టాలు వస్తున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.  మరో వైపు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తితో లింక్ పెట్టి జీతాల విధానాన్ని అమల్లోకి తెచ్చింది.  నవంబర్ నుంచి ప్రొడక్షన్ లింక్డ్ సాలరీలు అమలు చేస్తోంది.  3 నెలలుగా జీతాలు ఆలస్యం, వేజ్ రివిజన్ లేదు. ప్రొడక్షన్ పెరగడానికి స్పేర్స్, రా మెటీరియల్ లేవు అంటున్నారు.   

ఖండించిన కమ్యూనిస్టు పార్టీలు CPI(M) ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ చంద్రబాబు వ్యాఖ్యలను "బెదిరింపు, భయపెట్టడం"గా ఖండించింది. స్టేట్ సెక్రటరీ శ్రీనివాస రావు, "పీడీ యాక్ట్‌తో కార్మికులను బెదిరిస్తున్నారని ఆరోపించరు.   CPI స్టేట్ సెక్రటరీ కె. రామకృష్ణ, 2021లో VSP కాపాడుతామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు U-టర్న్ తీసుకున్నారని.. ప్రైవేటైజేషన్ ఆపాలన్నారు.   1960ల్లో 32 మంది త్యాగాలతో స్థాపించబడిన గుర్తింపు, ఇప్పుడు Rs.20,000 కోట్ల రుణాల్లో ఉంది. కేంద్ర ప్యాకేజీతో 2025 ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేసులు పూర్తి ప్రొడక్షన్ చేయాలని లక్ష్యం.  కానీ ముందుకు సాగకపోవడంతో.. పెద్దగా లాభాలు రావడం లేదు. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరిపోవడం లేదని అంటున్నారు.