Airports Authority of India Recruitment: చెన్నైలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)- సదరన్ రీజియన్‌లోని వివిధ విమానాశ్రయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 119 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతులన్నవారు డిసెంబరు 27 నుంచి జనవరి 26 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(PMT)/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PET), డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. సీనియర్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.36,000 - రూ.1,10,000; జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.31,000 - రూ.92,000 జీతంగా ఇస్తారు.


వివరాలు..


మొత్తం పోస్టుల సంఖ్య: 119.


➥ జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 73 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-40, ఈడబ్ల్యూఎస్-06, ఓబీసీ-18, ఎస్సీ-02, ఎస్టీ-07.


అర్హత: పదోతరగతితోపాటు మూడేళ్ల డిప్లొమా (మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్) లేదా ఇంటర్ అర్హత ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్)/ మీడియం వెహికిల్ లైసెన్స్ ( కనీసం ఏడాది క్రితం జారీ)/ లైట్ మోటార్ వెహికిల్ (కనీస రెండేళ్ల క్రితం జారీ) ఉండాలి. నిర్ణీత శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.


➥ జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): 02 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-01, ఓబీసీ-01.


అర్హత: డిగ్రీ.


➥ సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 25 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-13, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-04, ఎస్సీ-04, ఎస్టీ-02.


అర్హత: డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్). సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.


➥ సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్‌): 19 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-08, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-04, ఎస్సీ-03, ఎస్టీ-02.


అర్హత: బీకామ్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం.


వయోపరిమితి: 20.12.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; సంస్థ ఉద్యోగులు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు. 


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు 50గా, ఎస్సీ-ఎస్టీలకు 40గా నిర్ణయించారు.


జీతం: నెలకు సీనియర్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.36,000 - రూ.1,10,000; జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.31,000 - రూ.92,000 జీతంగా ఇస్తారు.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.12.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.01.2024.


Notification


Online Application


Website


ALSO READ:


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 ఖాళీలు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 484 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...