Auxilo Finserve: రాబోయే 5 సంవత్సరాలలో (2028 నాటికి) దేశవ్యాప్తంగా 10 వేల పాఠశాలలు, విద్యా సంస్థలకు రుణ నిధులు సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆక్సిలో ఫిన్‌సర్వ్ సంస్థ తెలిపింది. ఈ మేరకు డిసెంబరు 20న ప్రణాళికలను ప్రకటించింది. విద్యా సంస్థలు తమ సామర్థ్య పెంపుదల, ప్రాంగణాల విస్తరణ కోసం భూమి కొనుగోలు, బోధనా సౌకర్యాల ఆధునీకరణ, అధిక ఖర్చుతో కూడిన అప్పుల భర్తీకి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఆర్థిక సహాయం చేయనున్నట్లు పేర్కొంది. 


ఈ సంద‌ర్భంగా ఆక్సిలో ఫిన్ సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నీరజ్ సక్సేనా మాట్లాడుతూ.. తమ సంస్థ 2018 మార్చి నుంచి విద్యా సంస్థలకు నిధులు అందించడం ప్రారంభించిందన్నారు. అయితే రాబోయే సంవత్సరాల్లో మహమ్మారి ప్రభావం త‌మ ప్రణాళికలను కాస్త నెమ్మదించేలా చేశాయన్నారు. సాధారణ స్థితికి పరిస్థితులు రావడంతో తాము ఇప్పుడు ఈ విభాగాన్ని దూకుడుగా ముందుకు కొనసాగిస్తున్నామన్నారు. 


భారతదేశమంతటా విద్యాసంస్థల రుణ అవసరాలను తీర్చడమే త‌మ ప్రణాళిక అని సక్సేనా అన్నారు. తాము ప్రోత్సాహకరమైన స్పందనలను అందుకున్నామన్నారు. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలతో భాగస్వాములం కావటంతో పాటుగా వారి మొత్తం అభివృద్ధిలో భాగమవుతామని ఆశిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దక్షిణ, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో త‌మ కార్యకలాపాలను విస్తరించిన తర్వాత తాము వచ్చే ఆర్థిక సంవత్సరంలో తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నామని తెలియజేశారు.


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరో తొమ్మిది రాష్ట్రాలకు సేవలు విస్తరించనుంది.  ఈ ఏడాది జులైలో కంపెనీ తన వాటాదారు ఐసిఐసిఐ బ్యాంక్ పోనెన్షియా ఆపర్చునిటీస్ ఫండ్ నుంచి​రూ. 470 కోట్లను సేకరించింది. 2020-23 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నిర్వహణ కింద రూ.2,500 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇవి 52.7 శాతం సీఏజీఆర్​తో వృద్ధి చెందాయి.


ALSO READ:


నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఫేజ్-2 ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను నవోదయ విద్యాలయ సమితి డిసెంబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డును అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు హాల్‌టికెట్లు ప్రింట్ తీసుకొని పరీక్ష రోజు వరకు భద్రపరచుకోవాలి. పరీక్షకు హాజరయ్యేవారు తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.
హాల్‌టికెట్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్‌', ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అవకాశం
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ (Internship) చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు డిసెంబరు 20న ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని బీటెక్ (B.Tech), ఎంటెక్ (M.Tech) చివరి సంవత్సరం చదివే విద్యార్థులతో.. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతులు చదివే విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఇంజినీరింగ్ కళాశాలలతో అనుసంధానించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..