AIATSL Recruitment: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) లేదా ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1049  పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సీనియర్ లెవల్ పోస్టులకు డిగ్రీతోపాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 14 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ పోస్టులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 1049


కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.


1) సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 343 పోస్టులు


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీ బాషలపై మంచి పట్టు ఉండాలి. 


వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.


జీతం: రూ.28,605.


2) కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 706 పోస్టులు


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీ బాషలపై మంచి పట్టు ఉండాలి. 


వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.


జీతం: రూ.27,450. 


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ పోస్టులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.


దరఖాస్తుకు చివరితేదీ: 14.07.2024.


చిరునామా: 
The Incharge, HR Department
AI AIRPORT SERVICES LIMITED
(Formerly known as AIR INDIA AIR TRANSPORT SERVICES LTD.)
CSMI Airport, Sahar, Mumbai 400099.


దరఖాస్తుకు జతచేయాల్సిన డాక్యుమెంట్లు.. 


➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు వివరాలు


➥స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్


➥ పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో, పాస్ సర్టిఫికేట్


➥ఇంటర్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికేట్


➥డిగ్రీ మార్కలు మెమో (1 - 4 సంవత్సరాలవి) 


➥డిగ్రీ సర్టిఫికేట్


➥ డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికేట్ (2022 – 2024 పాసవుట్)


➥డిప్లొమా కోర్సు 


➥ పీజీ డిగ్రీ సర్టిఫికేట్/ ప్రొవిజినల్ పీజీ డిగ్రీ సర్టిఫికేట్


➥ ఎంబీఏ మార్కుల మెమో (అన్ని సంవత్సరాలది)


➥వేరే ఏ ఇతర అర్హతలు ఉంటే.. వాటి సర్టిఫికేట్లు


➥ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్


➥ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు డిశ్చార్జ్ సర్టిఫికేట్


➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్


➥నేషనాలిటీ/డామిసైల్ సర్టిఫికేట్


➥ పాన్ కార్డు కాపీ


➥ఆధార్ కార్డు కాపీ


➥ EWS అభ్యర్థులకు ఇన్‌కమ్ సర్టిఫికేట్


Notification & Application


Online Application  


Website