జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 76 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌/ ఎండీ/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1న ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 76


* సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు


➥ అనస్థీషియాలజీ మరియు క్రిటికల్ కేర్: 04


➥ అనాటమీ: 02


➥ బయోకెమిస్ట్రీ: 01


➥ డయాగ్నస్టిక్ మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ: 07


➥ ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ: 04      


➥ జనరల్ మెడిసిన్: 16


➥ జనరల్ సర్జరీ: 04


➥ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 02


➥ మైక్రోబయాలజీ: 01


➥ న్యూక్లియర్ మెడిసిన్: 03


➥ నేత్ర వైద్యం: 01


➥ ఆర్థోపెడిక్స్: 03


➥ పీడియాట్రిక్స్: 01


➥ పాథాలజీ & ల్యాబ్. మెడిసిన్: 05


➥ ఫార్మకాలజీ: 04


➥ ఫిజికల్ మెడిసిన్ మరియు రిహాబిలిటేషన్: 01


➥ ఫిజియాలజీ: 01


➥ రేడియేషన్ ఆంకాలజీ: 01


➥ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ మరియు బ్లడ్ బ్యాంక్: 03


➥ ట్రామా & ఎమర్జెన్సీ(మెడికల్): 02


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌/ ఎండీ/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత.


వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.800. పీడబ్ల్యూబీడీ అభ్యర్థలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


జీతభత్యాలు: నెలకు రూ.67700 చెల్లిస్తారు. 


ఇంటర్వ్యూ తేది: 01.05.2023.


ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి.


Notification & Application


Website


Also Read:


గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...