గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 100
విభాగాల వారీగా ఖాళీలు..
1. అనస్థీషియా: 04
2. బయోకెమిస్ట్రీ: 01
3. బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ: 01
4. కార్డియాలజీ: 02
5. కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ: 02
6. కమ్యూనిటీ అండ్ ఫ్యామీలి మెడిసిన్: 01
7. డెర్మటాలజీ: 02
8. ఎండోక్రినాలజీ: 03
9. ఈఎన్‌టీ: 01
10. ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ: 02
11. గ్యాస్ట్రోఎంటరాలజీ: 03
12. జనరల్ మెడిసిన్: 07
13. జనరల్ సర్జరీ: 07
14. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 03
15. మెడికల్ ఆంకాలజీ/హెమటాలజీ: 01
16. మైక్రోబయాలజీ: 02
17. నియోనాటాలజీ: 02
18. నెఫ్రాలజీ: 03
19. న్యూరాలజీ: 02
20. న్యూరోసర్జరీ: 03
21. న్యూక్లియర్ మెడిసిన్: 04
22. ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ: 05
23. ఆఫ్తామాలజీ: 05
24. ఆర్థోపెడిక్స్: 05
25. పీడియాట్రిక్: 01
26. సర్జరీ పీడియాట్రిక్స్: 01
27. పాథాలజీ: 02
28. ఫార్మకాలజీ: 03
29. సైకియాట్రీ: 01
30. పల్మనరీ మెడిసిన్: 05
31. రేడియాలజీ: 02
32. రేడియోథెరపీ: 01
33. సర్జికల్ గాస్ట్రోఎంటరోలాజి: 02
34. సర్జికల్ ఆంకాలజీ: 01
35. ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్: 02
36. ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్: 06
37. యూరాలజీ: 02
పోస్టులు..
1. ప్రొఫెసర్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ/ ఎంఎస్/ పోస్టు గ్రాడ్యుయేషన్/ డాక్టరేట్ డిగ్రీ/ ఎంసీహెచ్/ డీఎం ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 12 - 14 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 58 సంవత్సరాలు మించకూడదు.
2. అడిషనల్ ప్రొఫెసర్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ/ ఎంఎస్/ పోస్టు గ్రాడ్యుయేషన్/ డాక్టరేట్ డిగ్రీ/ ఎంసీహెచ్/ డీఎం ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 8 - 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 58 సంవత్సరాలు మించకూడదు.
3. అసోసియేట్ ప్రొఫెసర్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ/ ఎంఎస్/ పోస్టు గ్రాడ్యుయేషన్/ డాక్టరేట్ డిగ్రీ/ ఎంసీహెచ్/ డీఎం ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 3- 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
4. అసిస్టెంట్ ప్రొఫెసర్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ/ ఎంఎస్/ పోస్టు గ్రాడ్యుయేషన్/ డాక్టరేట్ డిగ్రీ/ ఎంసీహెచ్/ డీఎం ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 1- 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 30.04.2023.
Notification
Also Read:
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..