AIIMS Recruitment: దియోఘర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్‌) డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నోటిఫికేషన్‌ వెల్లడైన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తులు సంబధిత చిరునామాకి పంపాలి.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 40


* జూనియర్ రెసిడెంట్ పోస్టులు 


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్‌) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు ఫీజు: యూఆర్‌ రూ.3000. ఓబీసీ రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా.


చిరునామా: Administrative Block, Fourth Floor, AIIMS Devipur, 
                    Permanent Campus Deoghar -814152(Jharkhand). 


ముఖ్యమైన తేదీలు..


నోటిఫికేషన్‌ తేదీ: 03.10.2023.


దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ ప్రచురితమైన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తులు సంబధిత చిరునామాకి పంపాలి.


Notification


Website


ALSO READ:


తెలంగాణ జెన్‌కో‌లో 60 కెమిస్ట్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.1.31 లక్ష వరకు జీతం
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ జెన్‌కో‌లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయిలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..