AIIMS: ఎయిమ్స్ భువనేశ్వర్ లో ప్రొఫెసర్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

Continues below advertisement

AIIMS Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భువనేశ్వర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 51

✦ ప్రొఫెసర్: 18 పోస్టులు

✦ అడిషనల్ ప్రొఫెసర్: 04 పోస్టులు

✦ అసోసియేట్ ప్రొఫెసర్: 10 పోస్టులు

✦ అసిస్టెంట్ ప్రొఫెసర్: 19 పోస్టులు

విభాగాలు: అనస్థీషియాలజీ: అనస్థీషియాలజీ, అనాటమీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఎండోక్రినాలజీ & మెటబాలిజం, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, *మెడికల్ ఆంకాలజీ /హెమటాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, పాథాలజీ/లాబొరేటరీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడ్. & బ్లడ్ బ్యాంక్, యూరాలజీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 21.02.2025 తేదీ నాటికి ప్రొఫెసర్/అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకి 58 సంవత్సరాలు మించకకూడదు. అసోసియేట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి 50 సంవత్సరాలు మించకకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,68,900, అడిషనల్ ప్రొఫెసర్ కు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,38,300, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కు రూ.1,01,500. 

దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపాల్సిన చిరునామా:
To,
The Assistant Administrative Officer, Recruitment Cell,
All India Institute of Medical Sciences, Bhubaneswar,
Sijua, Dumuduma, Bhubaneswar-751019
Tel. No: 0674-2476255.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.02.2025.

Notification

Website

ALSO READ:

BECIL: బీఈసీఐఎల్‌లో 170 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
BECIL Recruitment of Nursing Officer: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్) ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఒప్పంద ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ(పోస్ట్-సర్టిఫికేట్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 04 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement