భారత వాయుసేనలో 'అగ్నిపథ్‌' స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా అభ్యర్థుల తమ పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అగ్నివీర్ వాయు(01/ 2024) ఖాళీల భర్తీకి సంబంధించి అక్టోబర్‌ 13న ఆన్‌లైన్ రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి ఈ ఏడాది జులైలో నోటిషికేషన్(01/2024) వెలువడిన సంగతి తెలిసిందే.  జులై 27 నుంచి ఆగస్టు 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.


అగ్నివీర్‌ వాయు (1/2024) నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


స్టెనోగ్రాఫ‌ర్ అభ్యర్థులకు అలర్ట్. 'అప్లికేషన్ స్టేటస్' వివరాలు చెక్ చేసుకోండి, త్వరలో అడ్మిట్ కార్డులు అందుబాటులో
స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ టైర్-1 (ప్రిలిమినరీ) పరీక్ష హాల్‌టికెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అడ్మిట్ కార్డులను రీజియన్లవారీగా ఆయా వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 12, 13 తేదీల్లో స్టెనోగ్రాఫర్ టైర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌టికెట్లను రెండు, మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి నో యువర్ స్టేటస్, అభ్యర్థి రోల్ నెంబరు తదితర వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. తామ పరీక్షకు అర్హత సాధించింది లేనిది తెలుసుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సీడ్యాక్‌లో 277 ప్రాజెక్ట్ పోస్టులు, వివరాలు ఇలా
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) పలు ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 277 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..