కరోనా మహమ్మారి తర్వాత అమల్లోకి వచ్చిన వర్క్‌ ఫ్రం హోమ్‌ అందుబాటులో ఉండటంతో చాలా మంది ఐటీ నిపుణులు మూన్‌ లైటింగ్‌ చేస్తున్నారు. దీనిపై ఐటీ దిగ్గజాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో 300 మందిని ఇంటికి సాగనంపింది. మరో సంస్థ టీసీఎస్ తమ సంస్థ ఉద్యోగులకు పరోక్ష హెచ్చరికలు జారీచేసింది. మరో టెక్ దిగ్గజం ఐబీఎం కూడా మూన్‌లైటింగ్‌ను అనైతిక విధానంగా పేర్కొంది.


ఇప్పుడు ఇదే బాటలో ఐటీ జెయింట్‌ ఇన్ఫోసిస్‌ కూడా వచ్చి చేరింది. మూన్‌లైటింగ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ఉద్యోగి ఒకేసారి రెండు ఉద్యోగాల చేసే విధానానికి అనుమతి ఇవ్వబోమని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్‌ పరేఖ్‌ తేల్చి చెప్పేశారు. మూన్‌ లైటింగ్‌ పాల్పడిన ఉద్యోగులపై వేటు తప్పదని హెచ్చరించారు.  గత 12 నెలలుగా మూన్‌ లైటింగ్‌కు పాల్పడిన పలువురు ఐటీ నిపుణులను తొలగించినట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. అయితే, ఎంత మందిని తొలగించారన్న విషయమై ప్రకటన చేయలేదు.


 


:: Also Read ::  ఉద్యోగులకు టీసీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్, అలా చేస్తే ఊరుకోం!!


కాన్ఫిడెన్షియల్‌ అంశాలతో కూడిన ప్రాజెక్టుల్లో పని చేస్తున్న ఐటీ నిపుణులను ఇంటికి పంపేస్తామని సలీల్ పరేఖ్‌ వివరణ ఇచ్చారు. ఇన్ఫోసిస్‌లోనూ, బయట ఇతర ప్రాజెక్టులపై పని చేసేందుకు తమ ఉద్యోగులను అనుమతించే విషయమై విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని గిగ్‌ ప్రాజెక్టులపై పని చేయడానికి నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేనేజర్ల అప్రూవల్ తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.



కంపెనీ కాంట్రాక్చువల్‌, కాన్ఫిడెన్షియల్‌ కమిట్మెంట్స్‌ను పూర్తిగా గౌరవించాలని సలీల్‌ పరేఖ్‌ సూచించారు. ఈ విషయమై తమ సంస్థ సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా డ్యుయల్‌ ఉద్యోగాలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంతకుముందు మూన్‌ లైటింగ్‌పై విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌ జీ ఆందోళన వ్యక్తం చేశారు. మూన్‌ లైటింగ్‌కు పాల్పడిన 300 మందిని విప్రో తొలగించేసింది.


 


:: Also Read ::  ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!


 


IT Jobs: ఫ్రెష‌ర్స్‌కు షాకిస్తున్న ఐటీ దిగ్గజాలు, ఆఫ‌ర్ లెట‌ర్లపై యూట‌ర్న్‌!


ఐటీ దిగ్గజ సంస్థలైన విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్ర వంటి సంస్థ ఫ్రెష‌ర్లకు షాకిస్తున్నాయి. ఉద్యోగ ఆఫ‌ర్ లెట‌ర్లు ఇచ్చిన త‌ర్వాత అదిగో..ఇదిగో అంటూ నియామ‌క ప్రక్రియ‌లో జాప్యం చేసిన టెక్ సంస్థలు తాజాగా యూట‌ర్న్ తీసుకున్నాయి. ఫ్రెష‌ర్స్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ లెట‌ర్లను వెనక్కు తీసుకుంటున్నాయి. నెల‌ల త‌ర‌బ‌డి నియామ‌క ప్రక్రియ‌పై ముందుకు కదలని ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ లెట‌ర్లను తిర‌స్కరిస్తున్నట్లు తెలుస్తోంది.


మూడు, నాలుగు నెల‌ల కింద‌ట తాము ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మ‌హీంద్ర వంటి టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నామ‌ని, ప‌లు రౌండ్ల ఇంట‌ర్వ్యూల త‌ర్వాత త‌మ‌కు ఆఫ‌ర్ లెట‌ర్లు ఇవ్వగా తామిప్పుడు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నామ‌ని విద్యార్ధులు చెబుతున్నారు. కాగా త‌మ ఆఫ‌ర్ లెట‌ర్లను ర‌ద్దు చేశామ‌ని త‌మ‌కు ఆయా కంపెనీల నుంచి లెట‌ర్స్ వ‌చ్చాయ‌ని వారు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. అర్హతా నిబంధ‌న‌లు, కంపెనీ మార్గద‌ర్శకాల పేరుతో ఆఫ‌ర్ లెట‌ర్లను ర‌ద్దు చేస్తున్నట్లుగా ఆయా కంపెనీలు చెబుతున్నాయ‌ని ఎంపికైన అభ్యర్థులు వాపోతున్నారు.


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...