Ram Manohar Lohia hospital New Delhi: న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ అండ్ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెగ్యులర్‌ ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 255 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు జూన్ 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది


వివరాలు..


ఖాళీల సంఖ్య: 255


కేటగిరీల వారీగా ఖాళీలు..
యూఆర్- 108, ఈడబ్ల్యూఎస్- 24, ఓబీసీ- 60, ఎస్సీ- 43, ఎస్టీ- 20. 


* జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: నిబంధనల ప్రకారం.


దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 


ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతం: నెలకు రూ.56,100-1,77,500.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Central Diary & Dispatch Section, Near Gate No. 3, ABVIMS & Dr. Ram Manohar Lohia Hospital, New Delhi-110001.


ముఖ్యమైనతేదీలు..


⋆ దరఖాస్తు చివరి తేదీ: 05.06.2024.


⋆ అడ్మిట్ కార్డ్ అప్‌లోడ్ చేసిన తేదీ: 28.06.2024.


⋆ రాత పరీక్ష తేదీ: 07.07.2024.


Notification


Website


ALSO READ: 


జేకే బ్యాంకులో 276 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
JK Bank Recruitment: జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంకు అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీకి రూ.700. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు: రూ.500. సరైన అర్హతలున్నవారు మే 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (2)-2024 నోటిఫికేషన్ వెల్లడి, 404 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) & నేవల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ (II)- 2024 నోటిఫికేషన్ మే 15న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో దాదాపు 404 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2024, సెప్టెంబరు 1న రాతపరీక్ష నిర్వహించనుంది. శిక్షణ‌తోపాటు త్రివిధ ద‌ళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మే 15 నుంచి, జూన్ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆ తర్వాత జూన్ 5 నుంచి 11 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో 2025, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జులై 2 నుంచి నుంచి ప్రారంభమయ్యే  154వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 116వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..