చెన్నైలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏఏఐ సీఎల్‌ఏఎస్‌) ట్రాలీ రిట్రీవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 105 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 02వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్‌ ఎఫిషియన్సీ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 105


* ట్రాలీ రిట్రీవర్ పోస్టులు


కేటగిరీ వారీగా ఖాళీలు..


⏩ జనరల్‌: 44


⏩ ఓబీసీ: 28


⏩ ఎస్సీ: 15


⏩ ఎస్టీ: 07


⏩ ఈడబ్ల్యూఎస్‌: 11


అర్హత: 10వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 18-27 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ. 250.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియన్సీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.21300 చెల్లిస్తారు.


పని ప్రదేశం: చెన్నై.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 02.08.2023


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 31.08.2023.


Notification


Website



ALSO READ:


ఆగస్టు 1 నుంచి గురుకుల పోస్టుల నియామక పరీక్షలు, అభ్యర్థులకు ముఖ్య సూచనలు
తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 1 నుంచి నియామక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.  పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ పోస్టులకు మొత్తం 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు జరగునున్నాయి. ఆయా తేదీల్లో మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. మొద‌టి షిఫ్ట్ ఉద‌యం 8:30 నుంచి 10:30 వ‌ర‌కు, రెండో షిఫ్ట్ 12:30 నుంచి మ‌ధ్యాహ్నం 2:30 వ‌ర‌కు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు.  
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, హైదరాబాద్ యూనిట్‌లో ఖాళీలు ఎన్నంటే?
న్యూఢిల్లీలోని ప్రసార భారతీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా వీడియోగ్రాఫర్, సీనియర్ కరస్పాండెంట్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, కాపీ ఎడిటర్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, బులెటిన్ ఎడిటర్, బ్రాడ్‌క్యాస్ట్ ఎగ్జి్క్యూటివ్, అసైన్‌మెంట్ కోఆర్డినేటర్, యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-3), యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-2), వీడియో పోస్ట్ ప్రొడక్షన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.   పోస్టులవారీగా అర్హతలు, అనుభవం, వయోపరిమితి నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారు హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం, దూరదర్శన్ కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


'గ్రూప్‌-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్‌-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..