ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయంచారు. అక్టోబరు 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు...
ఖాళీల సంఖ్య: 47
రిజర్వేషన్లు: జనరల్-25, ఎస్సీ-03, ఎస్టీ-04, ఓబీసీ-05, ఈడబ్ల్యూఎస్-03, ఈఎస్‌ఎం-06.
Also Read: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, ఈ అర్హతలు తప్పనిసరి
1) సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 09
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్)
అనుభవం: 2 సంవత్సరాలు.
2) సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 06
అర్హత: బీకామ్ డిగ్రీ. 3-6 నెలల కంప్యూటర్స్ ట్రైనింగ్ కోర్సు చేసి ఉండాలి.
అనుభవం: 2 సంవత్సరాలు.
Also Read: ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
3) జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 32
అర్హత: 10వ తరగతితోపాటు, 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (మెకానికల్/ఆటోమోబైల్/ఫైర్). (లేదా) 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి.
* హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏడాది డ్రైవింగ్ అనుభవం ఉండాలి. (లేదా) లైట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో రెండేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30.09.2022 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలు,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: పోస్టులవారీగా రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డ్రైవింగ్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపికచేస్తారు.
Also Read: సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అయితే ఆరోగ్య, పరిశుభ్రత ఏర్పాట్ల కింద రూ.90 చెల్లించాల్సి ఉంటుంది.
రాతపరీక్ష విధానం:
* మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించే 100 మార్కుల పరీక్షలో పార్ట్-ఎ(అభ్యర్థి సబ్జెక్ట్): 50 ప్రశ్నలు-50 మార్కులు, పార్ట్-బి(జీకే,జనరల్ ఇంటెలిజెన్స్,జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్..): 50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.
* ఇక సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించే 100 మార్కుల పరీక్షలో పార్ట్-ఎ(అభ్యర్థి సబ్జెక్ట్): 70 ప్రశ్నలు-70 మార్కులు, పార్ట్-బి(జీకే,జనరల్ ఇంటెలిజెన్స్,జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్..): 30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
శిక్షణ సమయంలో స్టైపెండ్: రూ.25,000.
జీతభత్యాలు: సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు ₹36,000 - ₹1,10,000, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.₹ 31,000 - ₹ 92,000 వరకు చెల్లిస్తారు.
Read Also: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు!
ముఖ్యమైన తేదీలు...
- నోటిఫికేషన్ వెల్లడి: 30.09.2022.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.10.2022.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.11.2022.
- దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.11.2022.
- రాతపరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి తేది: వెల్లడించాల్సి ఉంది.
- రాతపరీక్ష తేది: వెల్లడించాల్సి ఉంది.
Notification
Online Application Link