లద్దాఖ్‌లోని ఎయిర్‌ఫోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌ఫోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(ఏఏఐసీఎల్‌ఏఎస్) సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు బీసీఏఎస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఎంపికైనవారు లేహ్‌లోని కేబీఆర్ ఎయిర్‌పోర్టులో పనిచేయాల్సి ఉంటుంది. వాక్-ఇన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 15
➥సెక్యూరిటీ స్క్రీనర్ (సర్టిఫైడ్)-03
➥ సెక్యూరిటీ స్క్రీనర్ (ట్రెయినీ)-12
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. బీసీఏఎస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
వయోపరిమితి: 31.08.2023 నాటికి 40-50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ ద్వారా కూడా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
స్టైపెండ్: రూ.15,000.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
General Manager (Engineering) Project,
AAI Project Office, KBR Airport,
Leh-194101, Ladakh.
ముఖ్యమైన తేదీలు..
➥ ఇంటర్వ్యూ తేదీ: 19.10.2023.
➥ ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటలకు.
➥ ఇంటర్వ్యూ వేదిక: AAI Project Office, KBR Airport, Ladakh.
➥ దరఖాస్తు చివరి తేది: 09.10.2023.
Email: gmproject-leh@aai.aero
ALSO READ:
రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఆయుష్ విభాగంలో టీచింగ్ పోస్టులు, అర్హతలివే
సికింద్రాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ, ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డా. హైదరాబాద్ ఎర్రగడ్డలోని బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, వరంగల్‌లోని డాక్టర్ ఏఎల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయుర్వేదంలో పీజీ డిగ్రీతోపాటు టీచింగ్ అనుభవం కలిగనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాలకు డీన్, యూనివర్సిటీ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వ్యాప్‌కోస్ లిమిటెడ్‌లో 140 కంట్రోల్ ఇంజినీర్ ఖాళీలు, అర్హతలివే!
గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్ లిమిటెడ్ సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్, ఫీల్డ్ క్వాలిటీ అసూరెన్స్ అండ్ కంట్రోల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..