73 percent of Amazon employees are thinking of quitting after 5 day return to office mandate : ప్రపంంచలో కరోనా తెచ్చిన మార్పు ఏమిటంటే.. అత్యధిక శాతం ఉద్యోగాలను ఇంటి దగ్గరే ఉండి చేసుకునేలా చేయడం. ముఖ్యంగా సాంకేతికతతో ముడిపడి ఉన్న ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోంకు షిప్ట్ అయ్యాయి. అయితే ఇంట్లో పని చేస్తున్నట్లుగా నటిస్తున్నారు కానీ పని చేయడం లేదని ప్రొడక్టివిటీ తగ్గిపోందని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడటంతో అన్ని  కంపెనీ వర్క్ ఫ్రం ఆఫీస్‌ను కంపల్సరీ చేస్తు్ననాయి. కానీ ఇది నచ్చని ఉద్యోగులు రాజీనామాలకు సైతం సిద్ధమంటున్నారట.                 


ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా ఎదిగిన అమెజాన్ వర్క్ ఫ్రం హోంను ఆపేసింది. వారానికి ఐదు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాలని రూల్స్ ప్రవేశ పెట్టింది. దీంతో అమెజాన్‌లోని ఏకంగా 73 శాతం మంది ఉద్యోగులు.. తమకు ఈ ఉద్యోగం వద్దు అని రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారట. అమెజాన్‌లో డెలివరీ బాయ్స్ తప్ప మిగతా అంతా ఆఫీసు నుంచి పని చేస్తారు. పైగా అమెజాన్‌కు అతి పెద్ద క్లౌడ్ సర్వీసెస్ కంపెనీ కూడా ఉంది. ఈ ఉద్యోగులందరూ కరోనా కాలం నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తూనే ఉన్నారు.మెల్లగా అందర్నీ ఆఫీసు వైపు మళ్లిస్తున్నారు కానీ.. స్వచ్చందంగానే ఆ చాన్స్ ఇచ్చారు. అయితే అలా వస్తున్న వారు తక్కువ కావడంతో.. కంపెనీ యాజమాన్యం వర్క్ ఫ్రం ఆఫీస్ కంపల్సరీ చేసింది. 


మరో ప్రాణం తీసిన "పని ఒత్తిడి" - ఐదు పేజీల లేఖ రాసి బజాజ్ ఫైనాన్స్ మేనేజర్‌ ఆత్మహత్య


అయితే ఇంటి దగ్గర ఉన్న సుఖం ఆఫీసుల్లో ఉండటం లేదని ఉద్యోగులు అనుకుంటున్నారు. అందుకే ఇంటి నుంచి కదిలేందుకు ఆసక్తి చూపిచడం లేదు. తప్పనిసరిగా ఆఫీసుకు రమ్మంటే..ఇక ఇంటి నుంచి పని చేసే వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిదని అనుకుంటున్నారు. ఐదు శాతమో.. పది శాతమో కాదు ఏకంగా 73  శాతం అమెజాన్ ఉద్యోగులు అదే ఆలోచనలో ఉన్నారని తాజాగా ఓ సర్వేలో వెల్లడయింది.  అమెజాన్ ఉద్యోగుల నుంచి చేసిన అభిప్రాయసేకరణలో ఈ విషయం వెల్లడయింది. వర్క్ ఫ్రం ఆఫీస్ కాన్సెప్ట్ ను 91 శాతం మంది వ్యతిరేకించారు. 



ఇది కూడా చదవండి: పండుగ ముందు వంటింట్లో రేట్ల మంట, గ్యాస్‌ బండ మరింత భారం