ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో 6,878 ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కార్మికశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆగస్టు 4న తెలిపింది. రాష్ట్రంలోని 83 ప్రభుత్వ, 432 ప్రైవేటు కలిపి మొత్తం 515 ఐటీఐలకు 8,077 పోస్టులు మంజూరు చేయగా, ప్రస్తుతం వాటిలో 1,199 మంది మాత్రమే పని చేస్తున్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో సైతం ఇదే తరహా పరిస్థితి ఉందని తెలిపింది. డైరెక్టర్‌ జనరల్‌ ట్రైనింగ్‌(డీజీటీ), రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేసి సమస్యను పరిష్కరించాలని పేర్కొంది. 


చేనేత కార్మికుల సంఖ్య 1.77 లక్షలు..
2019-20 లెక్కల ప్రకారం ఏపీలో చేనేత కార్మికులు 1,77,447 మంది ఉన్నట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం తెలిపింది. నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ డవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద 2018-19 నుంచి 2022-23 వరకు 3,632 మంది చేనేత కార్మికులకు ఏపీలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ఇందులో 2,340 మందికి 2018-19లో శిక్షణ ఇవ్వగా, 2019-20లో 120, 2020-21లో 60, 2021-22లో 746, 2022-23లో 366 మందికి మాత్రమే తర్ఫీదిచ్చినట్లు వెల్లడించింది.


ALSO READ:


తెలుగు రాష్ట్రాల కోర్టుల్లో 219 మెజిస్ట్రేట్ పోస్టులు ఖాళీ, రాజ్యసభలో కేంద్రం వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 219 న్యాయాధికారుల(మెజిస్ట్రేట్) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74, తెలంగాణలో 145 మెజిస్ట్రేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రాల పరిధిలోకి కోర్టుల్లో ఖాళీల భర్తీలో కేంద్ర ప్రభుత్వ పాత్రేమీ ఉండదని.. వాటి నియామక బాధ్యత రాష్ట్ర హైకోర్టులు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలదేనని మేఘ్‌వాల్‌ తెలిపారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో 39 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ, కేంద్రం వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల బోధనకు సంబంధించి 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలపై ఆగస్టు 2న రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణదేవి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఏపీలో 2020-21 విద్యాసంవత్సరంలో 22,609 ఖాళీలు ఉండగా.. 2021-22 విద్యాసంవత్సరం నాటికి 38,191కి చేరాయి. ఇక 2022-23 విద్యాసంవత్సరానికి మొత్తం ఖాళీల సంఖ్య 39,008కి పెరిగినట్లు ఆమె వెల్లడించారు. అంటే రాష్ట్రంలో రెండేళ్లలో ఖాళీలు 16,399 మేర పెరిగాయి. 1,56,895 టీచర్‌ పోస్టులకుగాను ప్రస్తుతం 1,17,887 మంది పనిచేస్తున్నట్లు అన్నపూర్ణదేవి తెలిపారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో 11,348 టీచర్ పోస్టులు ఖాళీ, రాజ్యసభలో కేంద్రం వెల్లడి
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 11,348 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 97,710 పోస్టులకుగాను 86,362 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ఆగస్టు 2న రాజ్యసభకు తెలిపారు. ఇక ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద తెలంగాణలో 543 పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. మొత్తం 14,500 పాఠశాలలను బాగు చేయాలన్నది లక్ష్యంగా కాగా తొలిదశలో 27 రాష్ట్రాల్లో 6,207 పాఠశాలలను ఎంపిక చేశామని, అందులో తెలంగాణ నుంచి 543 ఉన్నాయని మంత్రి వివరించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...