ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల బోధనకు సంబంధించి 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలపై ఆగస్టు 2న రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణదేవి ఈ మేరకు సమాధానమిచ్చారు. 


ఏపీలో 2020-21 విద్యాసంవత్సరంలో 22,609 ఖాళీలు ఉండగా.. 2021-22 విద్యాసంవత్సరం నాటికి 38,191కి చేారాయి. ఇక 2022-23 విద్యాసంవత్సరానికి మొత్తం ఖాళీల సంఖ్య 39,008కి పెరిగినట్లు ఆమె వెల్లడించారు. అంటే రాష్ట్రంలో రెండేళ్లలో ఖాళీలు 16,399 మేర పెరిగాయి. 1,56,895 టీచర్‌ పోస్టులకుగాను ప్రస్తుతం 1,17,887 మంది పనిచేస్తున్నట్లు అన్నపూర్ణదేవి తెలిపారు. 


ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) స్కీం కింద ఆంధ్రప్రదేశ్‌లో 662 పాఠశాలలను ఎంపికచేసినట్లు కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు.


ALSO READ:


యూనివర్సిటీ అధ్యాపకులకు గుడ్ న్యూస్, ఉద్యోగ విరమణ వయసు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీలోని విశ్వవిద్యాలయ అధ్యాపకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు జులై 29న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు అందులో పేర్కొంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


1207 'స్టెనోగ్రాఫ‌ర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ - 2023 ప్రక‌ట‌న‌ను ఆగస్టు 2న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్ పరీక్షల షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెష‌న్లలో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా  మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ప్రిలిమ్స్ పరీక్షను మే 28న నిర్వహించగా.. జూన్‌ 12న ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...