TS DSC 2024 Applications Details: తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జులై 17 నుంచి కంప్యూటర్ ఆధారిత డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తు గడువు జూన్ 20తో ముగియగా.. మొత్తం 2,79,956 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 27,027 దరఖాస్తులు రాగా.. తర్వాత నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు అందాయి. నాన్‌లోకల్ కోటా (5 శాతం) కింద అవకాశం ఉండటంతో ఇతర జిల్లాలకు చెందినవారు కూడా.. హైదరాబాద్ జిల్లాలో అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇక అతి తక్కువగా మేడ్చల్ జిల్లా నుంచి 2,265 దరఖాస్తులు రాగా.. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు అందాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 25 చొప్పున పోటీపడుతున్నారు.


డీఎస్సీ పోస్టులకు సంబంధించి.. డీఎడ్, బీఎడ్ పూర్తిచేసి టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్(SA).. రెండు పోస్టులకు దరఖాస్తుకు అర్హులు. బీఈడీ పూర్తిచేసి టెట్ ఉత్తీర్ణత ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్‌లోనే  రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రకారం డీఎస్సీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య 2 లక్షల వరకు ఉండవచ్చని విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి డీస్సీకి ఉచితంగా అర్హత కల్పించింది. దీంతో  23,919 మంది అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకున్నారు.


తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT)- 6,508 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌- 2,629 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్- 727 పోస్టులు, పీఈటీ(వ్యాయామ ఉపాధ్యాయులు)-182 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్(స్కూల్ అసిస్టెంట్)- 220 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్జీటీ)- 796 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జులై 17 నుంచి 31 వరకు రెండువారాలపాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంటుంది.


డీఎస్సీ పరీక్ష విధానం..







డీఎస్సీ 2024లో ఏ జిల్లాలవారీగా ఖాళీల వివరాలు..


INFORMATION BULLETIN  


Website


ALSO READ:


గ్రూప్-2 ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా గ్రాండ్‌ టెస్టులు - దరఖాస్తు ఇలా
గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ గొప్ప అవకాశం కల్పించింది. గ్రూప్‌-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు 'ఫ్రీ ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు' (Group2 Grand Test) నిర్వహించనుంది. అభ్యర్థులు జులై 5 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్ణాయిత షెడ్యూలు ప్రకారం.. జులై నెలలో ప్రతివారంలో రెండు రోజులు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. జులై 8, 9; జులై 15, 16; జులై 22, 23; జులై 30, 31 తేదీల్లో గ్రాండ్‌ టెస్టులు నిర్వహించనున్నారు.
గ్రాండ్ టెస్ట్ దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .