➥ పీజీ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక

తెలంగాణలోని జూనియర్‌ కళాశాలల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి అధ్యాపకులను ఎంపిక చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీని నియమించి, పీజీ మార్కుల ఆధారంగా, జిల్లా వారీగా 1:3 నిష్పత్తిలో దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా జులై 19న నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. షెడ్యూలు ప్రకారం జులై 27న అభ్యర్థుల మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు. జులై 28న తుది ఎంపిక చేసి, నియామకపత్రాలు ఇస్తారు. నియామక పత్రాలు పొందిన వారు ఆగస్టు 1లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

పీజీ‌ అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికా‌రి కార్యాలయంలో జులై 24లోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రిన్సిపాల్‌లతో కూడిన కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థులు పీజీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 

జిల్లాలవారీగా పోస్టుల వివరాలు ఇలా..

జిల్లా పోస్టుల వివరాలు
సిరిసిల్ల 27
జనగామ  33
గద్వాల  40
వనపర్తి  48
భద్రాద్రి కొత్తగూడెం 45
సిద్దిపేట  69
కామారెడ్డి 78
నిజామాబాద్  58
మహబూబాబాద్ 21
మెదక్  68
నాగర్‌కర్నూల్  67
సూర్యాపేట  17
వికారాబాద్  59
సంగారెడ్డి  101
మేడ్చల్  24
ఆసిఫాబాద్  61
వరంగల్ 19
ఖమ్మం  42
హనుమకొండ  17
జగిత్యాల  51
కరీంనగర్  28
నల్గొండ   53
మంచిర్యాల  37
ఆదిలాబాద్  63
పెద్దపల్లి 
మొత్తం పోస్టులు 1654

ALSO READ:

హైకోర్టు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల రెండో జాబితా వెల్లడి, 63 మంది ఎంపిక!
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 135 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల రెండో ఎంపిక జాబితా విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థల జాబితాను అందుబాటులో ఉంచారు. రెండో జాబితాలో మొత్తం 63 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపికయ్యారు. ఏపీ హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్‌లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి జాబితాలో 90 అభ్యర్థుల ఎంపిక కాగా 70 విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీల భర్తీకి గాను రెండో జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు జులై 24, 25, 26వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial