తెలంగాణ తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించినన ఫైనల్ ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ నవంబరు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత ఫైనల్ కీని టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. అభ్యంతరాలు నమోదుచేసిన అభ్యర్థులు ఫైనల్ కీ సరిచూసుకోవచ్చు.


'గ్రూ‌ప్-1' ప్రిలిమినరీ కీపై అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సబ్జెక్టు నిపుణుల కమిటీలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ కమిటీ అభ్యంతరాలను క్షుణ్నంగా పరిశీలించి.. 5 ప్రశ్నలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో రెండు ప్రశ్నలకు రెండు కంటే ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించింది.


గ్రూప్-1 ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి..


'గ్రూప్-1' ప్రిలిమినరీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను కమిషన్ తొలగించింది. 107వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 లేదా 2 లేదా 3 లేదా 4లో ఏది పేర్కొన్నా ఒక మార్కు ఇవ్వనున్నట్లు కమిషన్ తెలిపింది. అలాగే 133వ ప్రశ్నకు ఒకటి లేదా రెండు ఈ రెండింటిలో ఏ ఆప్షన్ గుర్తించినా మార్కు కేటాయించనుంది. 57వ ప్రశ్నకు సమాధానాన్ని ఆప్షన్ ఒకటిగా సవరించింది.


మార్కులు ఎలా కేటాయిస్తారు...?
'గ్రూప్-1' పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలను తొలగించిన నేపథ్యంలో 145 ప్రశ్నలనే టీఎస్‌పీఎస్సీ పరిగణనలోకి తీసుకోనుంది. అభ్యర్థులకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దామాషా పద్ధతిలో తుది మార్కులను లెక్కించనుంది. నోటిఫికేషన్‌లోని పేరా నం.8(4) ప్రకారం ప్రశ్నలను తొలగించినపుడు వాటిని మినహాయించగా మిగతా ప్రశ్నలకు అభ్యర్థి సాధించిన మార్కులను మొత్తం మార్కుల కింద దామాషా పద్ధతిలో మార్కులు గణించనుంది. ఇవి లెక్కించేటపుడు మూడో డెసిమల్ పాయింట్ వరకు పరిగణనలోకి తీసుకోనుంది.


ఉదాహరణకు ఒక అభ్యర్థికి 120 మార్కులు వచ్చాయనుకుందాం. ప్రిలిమినరీలో 5 ప్రశ్నలు తొలగించినందున, మిగతా 145 ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున మొత్తం 145 మార్కులకు 120 వచ్చినట్లు అవుతుంది. తుది మెరిట్‌ను దామాషా పద్ధతిన 150 మార్కులకు లెక్కిస్తారు. అంటే... అభ్యర్థికి 145 మార్కులకు 120 మార్కులు వచ్చాయి. ఈ లెక్కన 150 మార్కులకు సాధించిన స్కోరు 150/145 x 120=124.137... అంటే ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థి మార్కులు 124.137 అవుతాయి. ఈ లెక్కన ప్రతి అభ్యర్థి మార్కులను మూడు డెసిమల్స్ వరకు తీసుకుని.. తుది మెరిట్ జాబితాను కమిషన్ రూపొందించనుంది.


 


:: ఇవీ చదవండి :: 


 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పరీక్ష 'కీ' విడుదల, అందుబాటులో రెస్పాన్స్ షీట్లూ !
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష ప్రాథమిక కీని  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబరు 15న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ ద్వారా తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, టీఎస్పీఎస్సీ ఐడీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ 'కీ', రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి.. 


ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...