India's Competitiveness:
కొవిడ్‌తో అస్తవ్యస్తం..
భారత్‌కు ఇది అమృత కాలం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా...ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట ఇది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత్ అసలు మనగలుగుతుందా అని అనుమాన పడ్డాయి అన్ని దేశాలు. కానీ...75 ఏళ్లలో ఎన్నో మారిపోయాయి. ఇప్పుడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల దేశాల జాబితాలో ఉంది భారత్. కొన్ని దశాబ్దాలుగా ఇటుక ఇటుక పేర్చుతూ...ఆర్థిక వ్యవస్థ పునాదుల్ని చాలా బలంగా నిర్మించుకుంది. కరోనా ముందు వరకూ దూసుకెళ్లిన ప్రగతి రథం...ఆ తరవాత కాస్త నెమ్మదించింది తప్ప పూర్తిగా ఆగిపోనైతే లేదు. పలు అగ్రదేశాలకు పోటీగా నిలుస్తోంది కూడా. ప్రస్తుతానికి భారత్ మధ్యాదాయ దేశంగా కొనసాగుతోంది. ఇన్నేళ్ల ప్రయాణాన్ని గమనిస్తే ఎన్నో ఎత్తు పల్లాలున్నాయి. పేదరికం మునుపటి కన్నా తగ్గింది. ఆర్థిక అసమానతలు కొంత వరకూ తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్సం క్షోభం చుట్టు ముట్టింది. ఫలితంగా...ఆర్థిక పురోగతి కాస్త నెమ్మదించింది. కనీస వసతులైన వైద్యం, విద్యపై ప్రతికూల ప్రభావం పడింది. కొవిడ్‌కు ముందేనిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. అంతెందుకు. 2005 నుంచే నిరుద్యోగ రేటు పెరుగుతూ వస్తోందని నిపుణులు లెక్కలతో సహా వివరిస్తున్నారు. కార్మిక శక్తి కూడా క్రమేణా తగ్గుముఖం పడుతోంది. వ్యవసాయ రంగంలో ఆశించిన మార్పులు రావటం లేదు. చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ప్రొడక్టివిటీ తగ్గిపోతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI),విదేశీ వాణిజ్యం విషయంలో భారత్ మునుపటితో పోల్చుకుంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ...అది ఈ మధ్య కాలంలో కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. ఇప్పుడిదే భారత్‌ను బాగా కలవర పెడుతున్న విషయం.
ప్రధాన సమస్యలివే..
భారత్‌లో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య ఏంటంటే..అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమంగా విస్తరించకపోవటం. అంటే...కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతోంది. ఆ ప్రాంతాలే దేశ జీడీపీకి తమ వంతు వాటా అందిస్తున్నాయి. ఓవరాల్‌గా చూస్తే...జీడీపీ బాగున్నట్టే
కనిపిస్తున్నా...అన్ని చోట్ల అదే స్థాయి పురోగతి లేదన్న వాదన వినిపిస్తోంది. వ్యాపారపరంగా ఒక్కో చోట ఒక్కో విధమైన వాతావరణం ఉండటం ఇందుకు ప్రధాన కారణం. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలు కొన్ని సరైన ఫలితాలు అందించటం లేదు. అభివృద్ధి అనేది క్లస్టర్ల వారీగా వికేంద్రీకరణ (Decentralized) అయింది. ట్రేడెడ్ క్లస్టర్స్...అంటే ఎక్కడైతే వాణిజ్యం ఎక్కువగా ఉంటోందో ఆ ప్రాంతమే మిగతా ప్రాంతాలతో పోటీ పడుతూ ముందుంటోంది. అలాంటి చోట్ల రోజువారి వేతనాలు భారీగానే ఉంటున్నాయి. మిగతా దేశాల్లో ఇలా కాదు. ట్రేడెడ్ క్లస్టర్స్‌లోనూ రోజువారి వేతనాలు తక్కువే ఉంటున్నాయి. అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే కేంద్రీకరణ అవుతుండటం వల్ల అంతర్గత వలసలు పెరుగు తున్నాయి. ఓ వర్గం వాళ్లు, ఓ కులం వాళ్లు అంతా కలిసి ఒకే చోటకు తరలిపోయే అక్కడే ఓ సమూహంగా జీవించేందుకు ఇష్టపడుతున్నారు. దీని వల్ల నైపుణ్యం అంతా ఒక్క చోటే పరిమితమవుతోంది. అయితే...ఈ ఆర్థిక స్థితిగతులు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ...అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ ఇవ్వడంలో మాత్రం భారత్ ముందంజలోనే ఉంటోంది. భవిష్యత్‌లో భారత్ అగ్ర దేశాల పక్కన నిలబడగలదు అని ధీమాగా చెప్పటానికి కారణం కూడా ఇదే.
కానీ...ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే...భారత్‌లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ పోటీలో ముందుండటం. నైపుణ్యం, మౌలిక వసతుల విషయంలో...ఇంకా మారాల్సింది ఎంతో ఉంది. విధానాల్లో సంస్కరణలు చేయకుండా...పోటీలో నిలబడాలనుకుంటే ఎలా అన్నదే ఆర్థిక నిపుణుల సూటి ప్రశ్న. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్‌లో ఎన్నో మార్పులు రావాలని వాళ్లంతా ఆకాంక్షిస్తున్నారు. విద్యుత్, విద్య రంగాల్లో భారత్ సాధించిన పురోగతి తక్కువేమీ కాదు. కానీ...వీటి ఫలాలు అందించటంలో మాత్రం ఇంకా సమస్యలుఎదురవుతూనే ఉన్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్‌ను భారీ సబ్సిడీలతో అందించటం వల్ల ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇక విద్యారంగంలో ప్రభుత్వ విద్యా సంస్థలను మెరుగుపరచటంలో సవాళ్లు అలానే ఉన్నాయి. అందుకే...పాలసీలు తయారు చేయగానే సరిపోదు. వాటిని సరైన దిశలో అమలు చేయాలని ఎక్స్‌పర్ట్‌లు చాలా గట్టిగా చెబుతున్నారు.
Also Read: India China Border: ఇప్పుడు 1962 కాదు చైనా, గుర్తు పెట్టుకో- ఇది నయా భారత్ తట్టుకోలేవు!