Sleeping Position For Better Rest: ఆధునిక జీవనశైలి వేగంగా మారుతున్న కొద్దీ, మనకు అత్యంత అవసరమైన ఒక ప్రాథమిక అంశం కనుమరుగైపోతోంది. అదే – ప్రశాంతమైన, గాఢమైన నిద్ర. అలసిపోయి పడుకున్నప్పటికీ, ఒత్తిడి కారణంగా లేదా సరైన నిద్ర భంగిమ తెలియకపోవడం వల్ల చాలా మంది ప్రజలు ప్రశాంతమైన నిద్రను పొందలేకపోతున్నారు. రోజువారీ జీవితంలో విజయం సాధించాలంటే, నిద్రలో శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడం తప్పనిసరి. మనం ధరించే దుస్తులు, తినే ఆహారం వంటి వాటి గురించి శ్రద్ధ వహించినంతగా, మనం నిద్రించే విధానం, దాని వెనుక ఉన్న సైన్స్ గురించి పట్టించుకోము.

Continues below advertisement

నిపుణుల పరిశోధన ప్రకారం, మనం మంచం మీద పడుకున్నప్పుడు, మన శరీరం దాదాపు ఆటోమేటిక్‌గా, దానికి అవసరమైన ఒక ప్రత్యేక యాంగిల్‌ను తీసుకుంటుంది. ఇది కేవలం అలవాటు కాదు; మన శరీరం సహజమైన నేచర్‌ అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సహజ ప్రతిస్పందనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే? చాలా మంది నిద్రపోయేటప్పుడు తమ శరీరాన్ని పూర్తిగా దుప్పటి కింద దాచకుండా, ఒక కాలును బయటకు తీసి నిద్రపోతారు. ఈ వింత అలవాటు కేవలం నిద్రలేమి ఫలితం మాత్రమే కాదనేది శాస్త్రీయంగా తేలింది. దీని కారణంగానే చాలా మందికి నిద్ర నాణ్యత పెంచుకోవచ్చట. శరీరంలో జరిగే అంతర్గత టెంపరేచర్‌ బ్యాలెన్స్‌ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది.

మనం గాఢ నిద్రలోకి జారుకునే ముందు, మన శరీరం అంతర్గత ఉష్ణోగ్రతలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. నిపుణుల ప్రకారం, మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు, శరీర ఉష్ణోగ్రత దాదాపు ఒక డిగ్రీ వరకు తగ్గుతుంది. ఈ ఉష్ణోగ్రత తక్కువే కావచ్చు. కానీ మన మెదడు, శరీరం నిద్రపోవడానికి, ముఖ్యంగా గాఢ నిద్ర దశకు చేరుకోవడానికి ఈ వ్యత్యాసం చాలా అవసరం  

Continues below advertisement

మనం దుప్పటితో పూర్తిగా కప్పేసి ఉంచితే, ఈ ఉష్ణోగ్రత తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీంతో వేడిని తగ్గించాలని శరీరానికి ఇది మన మెదడు సంకేతాలు పంపుతుంది. ఫలితంగా మనకు తెలియకుండానే సహజ చల్లదనం కోసం, సులభంగా నిద్ర పట్టడానికి ఒక కాలును బయటకు తీస్తాం. శరీరం ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి చేపట్టే అసంకల్పిత చర్య. ఏ యాంగిల్‌లో పడుకున్నా చాలా మంది కాలును బయటకు పెట్టి ఉండే విషయాన్ని గమనించ వచ్చు.  

డాక్టర్ జెరాల్డ్ విశ్లేషణ: రక్త నాళాల ప్రత్యేక నెట్‌వర్క్ 

ఈ అలవాటు వెనుక ఉన్న సైంటిఫిక్ మెకానిజాన్ని ఫ్రాన్స్‌కు చెందిన డాక్టర్ జెరాల్డ్ మరింత వివరంగా వివరించారు. మన శరీరంలోని కొన్ని అవయవాలు, ముఖ్యంగా చేతులు, కాళ్ళలో రక్త నాళాల నెట్‌వర్క్ చాలా దట్టంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ అవయవాలలో కండరాల పొర కూడా పలుచగా ఉంటుంది.

ఈ ప్రత్యేకమైన శరీర నిర్మాణం కారణంగా:

1. వేడిని విడుదల చేయడం: ఈ అవయవాలు శరీరం నుంచి వేడిని విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

2. చల్లబరచడం: అవి శరీరాన్ని సమర్థవంతంగా చల్లబరచడంలో సహాయపడతాయి.

మన పాదాలు, మణికట్టు, తల వంటి ప్రాంతాల ద్వారా శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. ఈ భాగాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సహజ రేడియేటర్‌లుగా పనిచేస్తాయి. మనం ఒక కాలును దుప్పటి బయట ఉంచినప్పుడు, రక్త నాళాలు వేడిని విడుదల చేస్తాయి, ఆ వేడి చల్లటి గాలి తగిలి చల్లబడతాయి. ఇలా చల్లబడిన రక్తం తిరిగి శరీరంలోకి ప్రవహించి, అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గించి, గాఢ నిద్రకు కారణమవుతాయి. డాక్టర్ జెరాల్డ్ పరిశోధన, ఈ అలవాటు కేవలం 'నిద్ర కోసం' మాత్రమే కాదు, శరీరం ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థకు నిదర్శనమని స్పష్టం చేసింది.

నిద్ర విషయంలో ప్రజలు రెండు విభిన్న మార్గాలను అనుసరిస్తారు. కొంతమంది చలికి, వేడికి సంబంధం లేకుండా దుప్పటిని కప్పుకొని నిద్రపోతారు. ఇలాంటి వారిని 'బంక్-హగర్స్' అంటారు. మరికొందరు దుప్పటి లేకుండా నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. దుప్పటి కప్పుకుని ఒక కాలు బయటకు తీసే భంగిమలో పడుకునే వారికి, ఈ విధానం మంచి సౌకర్యవంతమైన నిద్రకు కారణమవుతుంది డాక్టర్ జెరాల్డ్ అభిప్రాయపడ్డారు.

ఆధునిక జీవనశైలి, స్క్రీన్ టైమ్, ఇతర కారణాలతో నిద్ర నాణ్యత దెబ్బతీంటున్నాయి. అలాంటి వాళ్లు ఈ టెక్నిక్‌ను ఉపయోగించి నిద్రను మెరుగుపరుచుకోవచ్చు.

1. గాలి తగలనివ్వండి: రాత్రి మీకు నిద్ర రాకపోతే లేదా వేడిగా అనిపిస్తే, మీ పాదాలు లేదా కాలికి కొంత గాలి తగలనివ్వండి.

2. చిన్న అడుగు-పెద్ద ఫలితం: ఈ చిన్న అడుగు మిమ్మల్ని చల్లని, ప్రశాంతమైన గాఢ నిద్రకు కారణమవుతుంది.  

మీ పడకగది ఉష్ణోగ్రతను చల్లగా ఉంచుకోవడం, దుప్పటిని పూర్తిగా కప్పుకోకుండా ఉంచడం ద్వారా శరీరం సహజ శీతలీకరణ యంత్రాంగానికి సహాయం చేయవచ్చు.