Sugar In Mango Shake: బయట ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగుతున్నా దాహం తీరడం లేదని చాలా మంది అంటున్నారు. ఎనర్జీ డ్రై అయిపోతుందని కొందరు డ్రింగ్స్‌ గటగటా తాగేస్తున్నారు. మిల్క్ షేక్‌లు, ఇతర ఫ్రూట్ షేక్‌లు లాగించేస్తున్నారు. మరికొందరు సీజనల్ ఫ్రూట్ అయిన మ్యాంగో షేక్‌లపై పడుతున్నారు. ఇలా మ్యాంగో షేక్‌లు తాగే క్రమంలో అందులో నిండుగా షుగర్ దట్టించి మరీ తాగుతున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో వాళ్లకు తెలియడం లేదు. ఎండ వేడికి అల్లాడిపోతున్న టైంలో నిండుగా మంచిగా పండిన మ్యాంగో, మిల్క్, షుగర్, ఐస్ క్యూబ్స్‌తో సిద్ధం చేసిన షేక్ తాగితే దెబ్బకు ఎండ వేడి ఎగిరిపోతుంది. కానీ అలా చేయడం ఎంత ప్రమాదకరమో మీరు ఊహించలేరు.  రుచిని పెంచడానికి అదనంగా చక్కెర వేసినప్పుడు, ఈ రుచికరమైన పానీయం మీకు విషం అవుతుంది. 

డబుల్ షుగర్ లోడ్

మామిడి ఒక సహజంగా తీపి పండు, ఇందులో అల్రెడీ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి చక్కెర పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. మీరు దీనికి అదనంగా శుభ్రంగాా పాలీస్‌ చేసిన చక్కెర కలుపుతున్నారు.  ఫలితంగా అందులో ఉండే గ్లైసెమిక్ లోడ్ చాలా పెరుగుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు చాలా ప్రమాదకరం. దీని వల్ల చక్కెర భారీగా స్పైక్ అయ్యే ప్రమాదం ఉంది. 

బరువు వేగంగా పెరుగుతుంది

మామిడి షేక్‌లో మామిడి స్లైస్‌లు, పాలు, చక్కెర కలుపుతారు, ఈ మూడింటిలోనూ కేలరీలు అధికంగా ఉంటాయి. చక్కెర కలపడం వల్ల ఈ పానీయం హై-కేలరీ లు కలిగిన డ్రింక్  అవుతుంది. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల మీరు ఊహించని విధంగా  బరువు పెరుగుతారు. ఊబకాయం వస్తుంది. దీని వల్ల హార్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్‌ , థైరాయిడ్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్సీ పవర్ తగ్గిపోతుంది. ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. 

గుండెకు నష్టం కలిగిస్తుంది

అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్లు భారీగా వేగంగా పెరుగుతాయి, ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటి అవుతుంది. మీరు గుండె జబ్బుల నుంచి బయటపడాలనుకుంటే మామిడి షేక్‌లో చక్కెర కలిపి తాగేే అలవాటు ఉంటే వెంటనే మానేయండి.

దంతాలు, చర్మంపై ప్రభావం

చక్కెర కారణంగా దంతాల మధ్య కావిటీస్ పెరుగుతాయి. అలాగే దీని వల్ల చర్మంలో గ్లైకేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది, ఇది చర్మంపై  వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. మీరు ఎంత యంగ్‌గా ఉన్నా వృద్ధులుగా కనిపించే ఛాన్స్ ఉంది. దీన్ని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల ముఖంపై మచ్చలు ,, ముడతలు త్వరగా రావడం ప్రారంభమవుతాయి. కాబట్టి సాధారణ మామిడి షేక్‌ తయారు చేసి తాగడానికి ప్రయత్నించండి. షుగర్ మాత్రం వేసుకోవద్దు

జీర్ణక్రియలో డిస్టర్బెన్స్‌ 

చక్కెర, పాల కలయిక కొంతమందిలో గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది. అజీర్ణ సమస్య రావచ్చు. కడుపు ఉబ్బరంగా మారుతుంది. ముఖ్యంగా ఇది మామిడి వంటి పండ్లతో తీసుకున్నప్పుడు. ఎక్కువగా ఉంటుంది. 

గమనికి: వార్తలో ఇచ్చిన సమాచారం వివిద మీడియా నివేదికల ఆధారంగా చెప్పింది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.