Why Mouth Taste Bitter During Fever: చాలా మంది జ్వరం వచ్చిన తర్వాత ఒక సాధారణ సమస్య ఎదుర్కొంటారు. నోరు చేదుగా మారుతుంది. ఏం తిన్నా సహించదు. నీళ్లు తాగినా సరే చేదుగానే ఉంటాయి. అసలు నోటికి రుచి అనేది తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుంది. ఇది కేవలం తాత్కాలిక సమస్యేనా లేదా దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఉంటాయా?

Continues below advertisement

జ్వరం అనేది శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు వచ్చే సంకేతం. కానీ జ్వరం తగ్గిన తర్వాత కూడా నోరు చాలా చేదుగా ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. వైద్యుల ప్రకారం ఇది డిస్గ్యూసియా అనే సమస్యకు సంబంధించింది. అంటే రుచి మారిపోవడం అని అర్థం. ఇలా జరగడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్, అంటే శరీరంలో నీరు తక్కువ అవ్వడం. జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరిగి నీరు ఎక్కువగా పోతుంది. దీంతో నోట్లో లాలాజలం త్వరగా ఎండిపోతుంది. ఇలా నోట్లో నీటి శాతం తగ్గితే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగానే నోరు చేదుగా మారుతుంది. ఇది సాధారణంగా జ్వరం తర్వాత ఒకట్రెండు రోజులపాటు ఉంటుంది. 

రెండో కారణం మందులు. జ్వరం వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్‌వాడతారు. ఇవి కూడా నోట్లో చేదు రుచికి కారణం అవుతాయి.  ఇంకా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌ కూడా కారణం. జలుబు, సైనస్‌ ఇన్ఫెక్షన్‌ లేదా ఫ్లూ వల్ల ముక్కు బ్లాక్ అవుతుంది. దీంతో ముక్కు నుంచి లిక్విడ్‌ గొంతులోకి వచ్చి నోట్లో చేదు రుచిని కలిగిస్తుంది. ఇది జ్వరంతో సంబంధం ఉన్న సమస్య. ముక్కు బ్లాక్ అయితే, నోటి ద్వారా ఊపిరి తీసుకోవాలి, దీంతో నోరు డ్రై అవుతుంది. డ్రై మౌత్‌ వల్ల బ్యాక్టీరియా పెరిగి, చేదు వస్తుంది. 

Continues below advertisement

ఇంకా లోతుగా చూస్తే ఇన్‌ఫెక్షన్స్‌ కలిగిస్తాయి. ఈ ఇన్‌ఫ్లమేషన్ ప్రోటీన్లు టేస్ట్‌ బడ్స్‌ను ప్రభావితం చేసి, రుచి మారుస్తాయి. ఉదాహరణకు ఓరల్ థ్రష‌ అనే ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల నాలుకపై వైట్‌ ప్యాచెస్‌ వచ్చి, చేదు రుచి వస్తుంది. ఇది జ్వరం సమయంలో ఇమ్యూన్‌ సిస్టమ్ బలహీనపడినప్పుడు జరుగుతుంది. మరోవైపు కిడ్నీ, లీవర్‌ సమస్యలు ఉంటే కూడా చేదు రుచి వస్తుంది. లివర్‌ హైపటైటిస్ వల్ల టాక్సిన్స్‌ సరిగా ఫిల్టర్ కాక, అమ్మోనియా లాంటి రుచి వస్తుంది. కానీ ఇవి రేర్‌ కేసులో జరుగుతుంది. 

ఆసిడ్‌ రిఫ్లక్స్‌ కూడా కారణం. జ్వరం సమయంలో ఆహారం సరిగా తినకపోతే కడుపులో ఆసిడ్స్‌ పైకి వస్తాయి. నోట్లో చేదుకు కారణమవుతాయి. ఇది జీర్ణ సమస్యలతో ముడిపడి ఉంటుంది. మహిళల్లో హార్మోనల్ ఛేంజెస్‌, ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కానీ జ్వరంతో సంబంధం లేకపోవచ్చు. 

ఇప్పుడు, ఈ సమస్యను ఎలా తగ్గించాలి? సాధారణ చిట్కాలు ఉన్నాయి. ముందుగా నీరు ఎక్కువగా తాగండి. రోజుకు 2-3 లీటర్లు నీరు తాగితే, డీహైడ్రేషన్ తగ్గుతుంది. హెర్బల్‌ టీ లేదా కొబ్బరి నీరు కూడా మంచిది. రెండోది, షుగర్‌ ఫ్రీ గమ్‌ చూయింగ్‌. ఇది సాలివా పెంచి, నోటిని ఫ్రెష్‌ చేస్తుంది. మూడోది బేకింగ్ సోడా రిన్స్‌: ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ బేకింగ్‌ సోడా కలిపి, నోరు కడగండి. ఇది అడిసిటీని తగ్గిస్తుంది. 

ఓరల్‌ హైజీన్‌ చాలా ముఖ్యం. రోజుకు రెండు సార్లు టూత్‌బ్రష్‌ చేయండి. ప్లాస్‌వాడండి. మౌత్‌ వాష్‌ ఉపయోగించండి. జ్వరం సమయంలో గ్రీసీఫుడ్‌ లేదా స్పైసీ ఫుడ్ తినకండి. ఎందుకంటే అని సమస్యను పెంచుతాయి.

కానీ ఈ చేదు రుచి ఒక వారం కంటే ఎక్కువ ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. ఇది పెద్ద సమస్యలకు సంకేతం కావచ్చు లాంటి డయోబెటిస్‌, లివల్‌ ప్రాబ్లమ్స్‌ లేదా నర్వ్‌ డ్యామేజ్‌. ముఖ్యంగా వెయిట్‌ లాస్‌, టైర్డ్‌నెస్‌ లాంటి ఇతర సింప్టమ్స్‌ ఉంటే వెంటనే చెక్ చేసుకోండి. మొత్తంగా జ్వరం తర్వాత చేదు రుచి సాధారణమే. కానీ కారణాలు తెలుసుకొని సరైన చర్యలు తీసుకుంటే సులభంగా తగ్గుతుంది.