Blue Veins Under Skin: మన చర్మం కింద కనిపించే నరాలు ఎందుకు నీలి రంగులో కనిపిస్తాయో మీరు ఎప్పుడైనా గమనించారా? రక్తం ఎరుపు రంగులో ఉంటుందని మనకు తెలుసు. మరి ఈ నరాలను నీలి రంగులో చూపేది ఏమిటి? మన శరీరంలో ఎక్కడైనా నీలి రక్తం ప్రవహిస్తుందా? దీని గురించి చాలా మంది అనుమానం ఉంటుంది. ఇలా ఉండటానికి ఏదైనా సమస్య ఉందా అని చాలామందికి అనిపిస్తుంది. ఏదైనా వ్యాధా అనే అనుమానం చాలా ందికి ఉంటుంది. సైన్స్ పరంగా చూస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది.
కాంతి ప్రభావంతో ఇలాంటి భ్రమ!
మన నరాల్లో ప్రవహించే రక్తం నీలి రంగులో ఉండదు. ఆక్సిజన్‌తో నిండి ఉన్నా లేదా ఆక్సిజన్ లేకున్నా రక్తం ఎల్లప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది. తేడా ఏమిటంటే ఆక్సిజన్‌తో ఉన్న రక్తం బ్రైట్ ఎరుపు రంగులో ఉంటుంది, అయితే ఆక్సిజన్ లేని రక్తం కొంత చిక్కగా ఉండడే ఎరుపు రంగులో ఉంటుంది. అలాంటి సమయంలో నరాలు నీలి రంగులో ఎందుకు కనిపిస్తాయి?
సూర్యకాంతి లేదా బల్బు కాంతి మన చర్మంపై పడినప్పుడు, అందులో ఉన్న అన్ని రంగులు చర్మంతో ఢీకొంటాయి. ఆ తర్వాత చర్మం కొన్ని రంగులను గ్రహిస్తుంది,, కొన్నింటిని వెనక్కి పంపుతుంది. కాబట్టి మనం నరాలు చూసినప్పుడు, వాటిలో ఎక్కువ భాగం నీలి కాంతి మన కళ్ళకు చేరుతుంది. అప్పుడు నరాలు నీలి రంగులో ఉన్నాయని మనకు అనిపిస్తుంది.
మన చర్మం కింద నరాలు కొంత లోపలికి ఉంటాయి. అలా డీప్‌గా ఉన్నప్పుడు కాంతి పడినప్పుడు వాటి రంగు మన కళ్ళకు వేరేలా కనిపిస్తుంది, ఎందుకంటే అది చేరే కాంతి మార్గం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కూడా సిరలు నీలి రంగులో కనిపించవచ్చు, అయితే వాస్తవానికి వాటి రంగు అలా ఉండదు.
మన కళ్ళు , మెదడు కలిసి ఒక రకమైన "కలర్ ప్రాసెసింగ్" చేస్తాయి. నరాల లోపలికి ఉండటం , చుట్టుపక్కల చర్మం రంగు, కాంతి ప్రసరించే దిశ, ఇవన్నీ కలిసి మెదడుకు వాటిని నీలి రంగులో ఉందని సంకేతాలను ఇస్తాయి. వాస్తవానికి ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్.
నీలి నరాలు ఏదైనా వ్యాధికి సంకేతమా?
నీలి నరాలు పూర్తిగా సాధారణం. సిరలు చాలా ఎక్కువగా ఉబ్బి ఉన్నట్లు అనిపిస్తే, నొప్పి ఉంటే లేదా వాపు అనిపిస్తే, వైద్యుడిని సంప్రదించడం అవసరం.
నీలి సిరలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇది సైన్స్, కాంతి కలయికతో కనిపించే మాయ. శరీరంలో ఏదైనా సమస్య ఉందని సంకేతం కాదు. ఇక ఎప్పుడైనా ఎవరైనా "నరాలు నీలి రంగులో ఎందుకు కనిపిస్తాయి?" అని అడిగినప్పుడు, మీరు సమాధానం చెప్పడమే కాకుండా, సైన్స్‌ను వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి.
గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.