Permanent Awakening Condition: "అబ్బబ్బా ఒకటే తల నొప్పి. రాత్రంతా నిద్ర పట్టలేదు". 10 మందిలో కనీసం ఇద్దరైనా ఇలానే వాపోతుంటారు. నిద్రలేమి ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న కామన్ ప్రాబ్లమ్. కనీసం 7 గంటల నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బ తింటుందని వైద్యులు చెబుతున్నారు. కాసేపు నిద్ర పడితే చాలని మనం అనుకుంటుంటే...అమెరికాలోని ఓ యువతి మాత్రం అసలు నిద్రే (Sleepless) పోవడం లేదట. అంటే 24 గంటలూ మెలకువతోనే ఉంటోంది. డాక్టర్ దగ్గిరికి వెళ్లి ఈ విషయం చెబితే ఇదో అరుదైన వ్యాధి అని తేల్చి చెప్పారు. New York Post వెల్లడించిన వివరాల ప్రకారం..స్కార్లెట్ కైట్లిన్ వాలెన్ (Scarlet Kaitlin Wallen) అనే 21 ఏళ్ల యువతి Persistent Genital Arousal Disorder (PGAD) తో బాధ పడుతోంది.
ఆరేళ్ల వయసు నుంచే యాతన..
ఎంత బలవంతంగా కళ్లు మూసుకున్నా క్షణం కూడా నిద్ర పట్టని వింత జబ్బు ఇది. ఆరేళ్ల వయసు నుంచే ఈ సమస్యతో ఇబ్బంది పడుతోంది స్లార్లెట్. అంత కన్నా నరకం ఏంటంటే మర్మాంగంలో సూదులు గుచ్చినట్టుగా విపరీతమైన నొప్పి వస్తోందని చెబుతోంది ఆ యువతి. ఆరేళ్లప్పటి నుంచీ ఇలా యాతన అనుభవిస్తోంది. ఆ కారణంగానే అటు చదువు పైనా, ఇటు పనిపైనా శ్రద్ధ పెట్టలేకపోయింది. చాలా అరుదుగా కనిపించే వ్యాధి ఇది. అయితే అందరిలోనూ ఈ లక్షణాల తీవ్రత ఒకేలా ఉండదు. దాదాపు 15 సంవత్సరాలుగా స్కార్లెట్ ఈ వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ బాధని కొంతైనా తగ్గించుకునేందుకు మర్మాంగం వద్ద కొన్ని నరాలను తొలగించుకుంది.
"నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనీ నొప్పితో బాధ పడుతూనే ఉన్నాను. అక్కడ తీవ్రమైన నొప్పితో మెలికలు తిరిగిపోయే దాన్ని. ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఒళ్లంతా పురుగులు కుట్టినట్టుగా ఉంటోంది. అందరిలా నాకూ ఆరోగ్యంగా జీవించాలనుంది"
- బాధితురాలు
ఎన్ని ప్రయత్నాలు చేసినా..
13 ఏళ్ల వయసున్నప్పుడు అప్పుడూ నొప్పి వస్తుండేది. కానీ ఆ తరవాత రోజూ ఇదే నొప్పితో నరకం చూడాల్సి వస్తోందని చెబుతోంది బాధితురాలు. ఫలితంగా ఒక్క క్షణం కూడా నిద్రపట్టడం లేదని అంటోంది. గ్రాడ్యుయేషన్ పూర్తైన తరవాత తొలిసారి వైద్యులను కలిసి తన సమస్య గురించి తెలుసుకుంది. అప్పటి నుంచి నొప్పి తగ్గించుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. కానీ అవేవీ వర్కౌట్ కావడం లేదు. ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా తన సమస్యని పరిష్కరించుకోలేకపోతున్నానని స్కార్లెట్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ జబ్బు నయం అవుతుందన్న నమ్మకమైతే ఉందని అంటోంది. అయితే...ఆమె శరీరం చికిత్స చేయడానికి కూడా వీల్లేనంత సెన్సిటివ్‌గా మారిపోయిందని ఇదే సమస్యగా మారిందని వైద్యులు వివరిస్తున్నారు. ఆమె నొప్పి తగ్గించేందుకు ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఆమె ఈ వ్యాధి నుంచి బయటపడేలా ఏదో చికిత్స అందిస్తామని అంటున్నారు.
Also Read: New Trend on Dry Promotion : జీతాలు పెంచరట కానీ బాధ్యతలు పెంచుతారట.. ఇదే కొత్త ట్రెండ్