ఇటలీ నుంచి పంజాబ్ అమృత్‌సర్‌కు వచ్చిన విమానంలోని 125 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విమానంలో మొత్తం 179 మంది ప్రయాణించారు. ఈ మేరకు అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వీకే సేఠ్ తెలిపారు.








ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాందోళనలు నెలకొన్న వేళ అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. పరీక్షలు చేసి ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

 

కరోనా కేసులు..

 

దేశంలో కొత్తగా 90,928 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 56% పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 797కు చేరింది. 


మహారాష్ట్ర.. 


మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 26,538 మందికి కరోనా సోకింది. ఒక్క ముంబయిలోనే 15,166 కేసులు నమోదయ్యాయి. 8 మంది వైరస్‌తో మృతి చెందారు. మంగళవారంతో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు 43.71 శాతం పెరిగాయి. 


డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక..


కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచం మరో కరోనా వేవ్ చూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ వేరియంట్‌ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని సూచించింది. చాలా మంది ఒమిక్రాన్‌కు సాధారణ జలుబు లక్షణాలు మాత్రమే ఉన్నాయని భావిస్తున్నారని.. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని తేల్చిచెప్పింది.


Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి