దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదుకాగా 181 మంది మృతి చెందారు. గత 224 రోజుల్లో ఇదే అత్యల్పం. దేశంలో రికవరీ రేటు 98.04%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు. గత 24 గంటల్లో 26,579 రికవరీకాగా మొత్త రికవరీల సంఖ్య 3,33,20,057కు పెరిగింది.
- మొత్తం కేసులు: 3,39,85,920
- యాక్టివ్ కేసులు: 2,14,900
- మొత్తం రికవరీలు: 3,33,20,057
- మొత్తం మరణాలు: 4,50,963
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం 0.63%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.
కేరళ..
కేరళలో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదుకాగా 84 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 48,01,796కు చేరగా మరణాల సంఖ్య 26,342కి పెరిగింది. గత 24 గంటల్లో 66,702 పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 1,058 కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురం (1,010), కోజికోడ్ (749) కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 1,736 కేసులు నమోదయ్యాయి. గత 17 నెలల్లో ఇదే అత్యల్పం. 36 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 65,79,608కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,39,578కి పెరిగింది.
ఐకాల్ ఎన్18 కాలింగ్ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్యూజన్5 4జీ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి