ఇటీవల వరుసగా తగ్గుతోన్న కరోనా కేసులు కాస్త పెరిగాయి. కొత్తగా 22,431 కరోనా కేసులు నమోదుకాగా 318 మంది మృతి చెందారు. 24,602 మంది కరోనా నుంచి కోలుకున్నారు.







  • యాక్టివ్ కేసులు: 2,44,198

  • మొత్తం రికవరీలు: 3,32,00,258

  • మొత్తం మరణాలు: 4,49,856

  • మొత్తం కేసులు: 3,38,94,312

  • మొత్తం వ్యాక్సినేషన్: 92,63,68,608 (గత 24 గంటల్లో 43,09,525)


మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1 కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 0.72%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 97.95%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు.






కేరళలో..


కొత్తగా 12,616 కరోనా కేసులు నమోదుకాగా 134 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 47,51,434కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 25,811కు చేరింది. 


గత 24 గంటల్లో 98,782 మందికి కరోనా పరీక్షలు చేశారు. 


మొత్తం 14 జిల్లాల్లో అత్యధికంగా ఎర్నాకులంలో 1,932 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తిరువనంతపురం (1,703), కోజికోడ్ (1265), త్రిస్సూర్ (1110) మలప్పురం (931)లో ఉన్నాయి.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 2,876 కరోనా కేసులు నమోదుకాగా 90 మంది మృతి చెందారు. 2,763 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.


Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేష‌న్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..


Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి