బరువు తగ్గించుకోవడం అనేది ఇప్పుడు చాలా మందికి పెద్ద సమస్య. ఎన్ని రకాల డైట్‌లు ఫాలో అవుతున్నా ప్రయోజనం లేదని బాధపడిపోతుంటారు. ఉన్న ఫళంగా బరువు పెరిగిపోతున్నామని బాధ పడిపోతుంటారు. అంతగా తినకపోయినా వెయిట్‌ పెరుగుతున్నాం... తగ్గేదెలా అంటూ తెగ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.  


బరువు పెరిగిపోతున్నామన్న ఆవేదనలో చాలా మంది ఫుడ్‌ను అవైడ్ చేస్తుంటారు. అది మరింత ప్రమాదకరమని చెబుతున్నారు వైద్యులు. దీని వల్ల బాడీలో ఫ్యాట్‌ ఎక్కువ పెరుగుతుందని.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే బరువు పెరుగుతున్నామన్న టెన్షన్ తగ్గించుకొని కూల్‌గా ఈ డైట్‌ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. 


యూనివర్శిటీ ఆఫ్ ముర్సియా అధ్యయనం ప్రకారం మీరు ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌, రాత్రి తీసుకునే ఆహారం మీ బరువుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తేలిందట. ఈ రెండింటినీ మేనేజ్ చేస్తే జీర్ణసమస్యలు, వెయిట్‌ లాస్, హెవీ వెయిట్‌ సమస్యలను అధిగమించవచ్చని అధ్యయనం చెబుతోంది. 


బ్రేక్‌ఫాస్ట్‌ ఎప్పుడు చేయాలి


మనలో చాలా మంది బరువు తగ్గడానికి ఏం తినాలి అని ఆలోచిస్తారే తప్ప.. ఎప్పుడు తినాలి ఎంత మోతాదులో తినాలి అనే ఆలోచన ఉండదు. మరికొందరు మధ్యహ్న భోజనం పుష్టిగా తినేసి రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ మానేస్తుంటారు. రోజంతా మన శరీరం అలసటి లేకుండా పని చేయాలంటే ఈ రెండు చాలా అవసరమని చెబుతున్నారు వైద్యులు.  


మనకు శక్తిని ఇవ్వడమే కాదు.. మన శరీరంలో జరిగే  ప్రక్రియలను బ్యాలెన్స్ చేస్తాయి ఈ టిఫిన్‌, డిన్నర్. ఈ రెండూ ఏదో టైంకు తీసుకుంటే పెద్ద ప్రయోజనం లేదంటున్నారు నిపుణులు. రోజూ ఒకే టైంకు తినడం వల్ల శరీరానికి శక్తి రావడమే కాకుండా బరువు పెరగకుండా ఉంటుందని చెబుతున్నారు. అందుకే మనం బరువు తగ్గాలంటే భోజనానికి ప్రత్యేక షెడ్యూల్ ఉండాలట. 


టిఫిన్ ఎప్పుడు తినాలంటే
 
ఉదయం 7 గంటలలోపు కడుపు నిండా ఫుల్‌గా టిఫిన్‌ తినేయమంటున్నారు నిపుణులు. దీని వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుందన్నది వాళ్ల వివరణ. రోజుంతా తక్కువ తినేలా చేస్తుందట. 


టిఫిన్‌లో ఏమి ఉండాలంటే
 
మాంసాహారాలు గుడ్లతో బ్రెడ్ తింటే మేలు అంటున్నారు. శాఖాహారులు ధాన్యపు టోస్ట్ మీద పెరుగు లేదా పీనట్‌ బటర్‌ వేసుకొని  తిమంటున్నారు. పోహా లేదా దోసను సాంబార్, కొబ్బరి చట్నీతో లాగించేయమంటున్నారు. 


లైట్‌ డిన్నర్
 
రాత్రిపూట డైజేషన్ సిస్టమ్‌ స్లో అవుతుంది. దాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి రాత్రిపూట ఆలస్యంగా డిన్నర్ చేస్తే అసలుే ప్రమాదం అన్న మాట గట్టిగా హెచ్చరిస్తున్నారు. దీని వల్ల అనూహ్యంగా బరువు పెరుగుతారని వాళ్ల వార్నింగ్. అందుకే రాత్రి 8 గంటలకే రాత్రి భోజనం చేయాలని సూచిస్తున్నారు.


డిన్నర్‌లో ఏం తినాలి:


సూప్, కాల్చిన చికెన్ లేదా చేప
ఒక గిన్నె నిండా సలాడ్
పాలక్ పనీర్ లేదా ఉడికించిన చనా మసాలాతో మల్టీగ్రెయిన్ రోటీ