ప్రపంచంలో దాదాపు నలభై రెండు కోట్ల మందికి మించిన జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతోంది.  కేవలం పెద్దలకే కాదు కొంతమంది చిన్నారుల్లో మధుమేహం బయటపడుతుండటం నిజంగా కలవరపెట్టే విషయమే.  అసలే పిల్లలు చాక్లెట్లు, స్వీట్లు విపరీతంగా తింటారు. ఇంట్లో కనిపించే పంచదార, హార్లిక్స్ వంటివి కూడా తినేస్తుంటారు. వారిలో కూడా డయాబెటిస్ రావడానికి ఇలాంటి తీపి పదార్థాలు అధికంగా తినడం కారణమవుతోందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అది నిజమా లేక అపోహ?  


తీపి... కారణం కాదు


తీపి పదార్థాలు అధికంగా తినడం వల్ల డయాబెటిస్ రాదు. తీసి పదార్థాలు పూర్తిగా తినని వారికి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ వచ్చాక తీపి పదార్థాలు తినడం నియంత్రించుకోవాలి. కానీ వాటిని తినడం వల్ల మధుమేహం వస్తుందనేది మాత్రం పూర్తిగా అపోహ. 


టైప్ 1 డయాబెటిస్ విషయానికి వస్తే ... మీ శరీరం ఇన్సులిన్ తయారుచేసే సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల వస్తుంది. దీనికి కచ్చితమైన కారణమేంటో ఇప్పటివరకు తెలియదు. దానిని నివారించే మార్గం కూడా ఇంకా కనిపెట్టలేదు.  దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ నిల్వల శాతం విపరీతంగా పెరిగిపోతుంది. 


టైప్ 2 డయాబెటిస్ లో శరీరంలో ఇన్సులిన్ తగినంత స్థాయిలో ఉత్పత్తి అవ్వదు.  అధిక బరువు వల్ల కూడా ఈ టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ లేని యువతలో కూడా ఈ డయాబెటిస్ రావచ్చు. సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారిలో ఈ రకం డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. 


జెస్టేషనల్ డయాబెటిస్  విషయానికి వస్తే... ఇది గర్భిణుల్లో కలిగేది. గర్భిణి, గర్భంలోని బిడ్డకు అవసరమైనంత స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది. అయితే ఇది భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంది.                            


పిల్లలకు వస్తుందా?



రావడానికి అవకాశాలు ఉన్నాయి. పిల్లల్లో టైప్ డయాబెటిస్ వస్తుంది. టైప్ 2 వచ్చే అవకాశం లేదు. దీనికి జన్యుపరమైన కారణాలు ఎక్కువ. పిల్లల దగ్గరి బంధువులకు ఎవరికైనా టైప్ 1 డయాబెటిస్ ఉంటే పిల్లలకు కూడా రావచ్చు. కచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పలేం. తల్లి లేదా తండ్రికి టైప్ 1 మధుమేహం ఉంటే వారికి పుట్టే పిల్లలకు ఆ వ్యాధి వచ్చే అవకాశం 3 నుంచి 8 శాతం దాకా ఉంది. 


అంతేకానీ పిల్లలు అధికంగా పంచదార, స్వీట్లు, చాక్లెట్లు వంటి తీపి పదార్థాలు అధికంగా తినడం వల్ల డయాబెటిస్ వస్తుందనేది మాత్రం అపోహ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


ALSO READ: ఇదెక్కడి విడ్డూరం.. ఈ మహిళ 40 సంవత్సరాలుగా నిద్రపోలేదు.. రాత్రుళ్లు వాళ్లతో కలిసి..


ALSO READ:సోయా ఉల్లి పెసరట్టు ఎప్పుడైనా ట్రై చేశారా..


ALSO READ:పదేళ్ల ముందే మరణ సంకేతాలు కనిపిస్తాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?