దేశంలో కొత్తగా 2,51,209 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. 627 మంది మృతి చెందారు. 3,47,443 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,80,24,771కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,05,611గా ఉంది. రికవరీ రేటు 93.60గా ఉంది.







డైలీ పాజిటివిటీ రేటు 15.88గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 17.47గా ఉంది. నిన్న ఒక్కరోజే 15,82,307 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం 72.37 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 


వ్యాక్సినేషన్..







భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 57,35,692 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,64,44,73,216కు చేరింది.


కీలక నిర్ణయం..


కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2023 జనవరి నాటికి 15 ఏళ్లు నిండిన వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. 15- 18 ఏళ్ల మధ్య వయసు వారితో పాటు వీరు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.


2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన వారు కూడా ఈ 15-18 ఏళ్ల కేటగిరీలోకే వస్తారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ కేటగిరీకి చెందిన 59 శాతం మంది పిల్లలు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొంది.