New COVID 19 like Chinese Virus: చైనాలో మరో ప్రమాదకరమైన, మరణాంతకమైన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  HKU5-CoV-2 రకం వైరస్  తదుపరి ప్రాణాంతక మహమ్మారికి కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు. సైంటిస్టుల  అభిప్రాయం ప్రకారం ఈ కొత్త వైరస్ మానవులను సోకే ,  వ్యాప్తి చేసే సామర్థ్యానికి  దగ్గరలో ఉందని చెబుతున్నారు. 

గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందుతున్న HKU5 వైరస్

HKU5 వైరస్ మొదట చైనాలోని ఒక ప్రయోగశాలలో గబ్బిలాలలో గుర్తించారు.  ఇది COVID-19 లీక్ అయినట్లు అనుమానిస్తున్న ప్రయోగశాల.   వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం ఈ కొత్త వైరస్ మానవ కణాలతో ప్రయోగశాల పరీక్షలలో ఎలా వ్యాప్తిస్తుందో అధ్యయనం చేసింది.  వైరస్  స్పైక్ ప్రోటీన్‌లో చిన్న మార్పు జరిగితే, అది మానవుల గొంతు, నోరు,  ముక్కులో ఉండే ACE2 కణాల తో బంధం ఏర్పరచుకుంటుంది.  ఈ మార్పు వైరస్‌ను మానవులను సోకే సామర్థ్యాన్ని  పెంచుతుంది.  మానవ కణాలు, వైరస్‌లో నిర్దిష్ట ఉత్పరివర్తనాలు లేకపోతే, తక్కువ ప్రతిస్పందన చూపిస్తాయి. అయితే , ACE2 కణాలతో బంధం ఏర్పరచడానికి అవసరమైన ఉత్పరివర్తనాలు ఉంటే వైరస్ సులభంగా  వ్యాపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. 

 HKU5 వైరస్  మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ MERS తో దగ్గరి సంబంధం కలిగి ఉంది.  ఇది అరేబియన్ ద్వీపకల్పంలో నివసించే లేదా ప్రయాణించే వారిని ప్రభావితం చేస్తుంది. MERS, COVID-19 లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది.  కానీ ఇది చాలా ప్రాణాంతకమని సైంటిస్టులు చెబుతున్నారు.  సోకిన వారిలో మూడవ వంతు మందిని చంపగలదని అంచనా వేశారు.  మింక్ లేదా సివెట్ వంటి   జంతువులకు HKU5 వ్యాప్తి చెందితే  అది మానవులకు వసోకే ముందు మరింత బలపడే ప్రమాదం ఉంది. 

శాస్త్రవేత్తలు వైరస్ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి అధిక-రిజల్యూషన్ ఇమేజింగ్ పద్ధతి అయిన క్రయో-ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని ఉపయోగించారు. స్పైక్ ప్రోటీన్‌లో కీలక భాగాలు 'క్లోజ్డ్' స్థితిలో ఉన్నాయని, ఇది సోకడం కష్టతరం చేస్తుందని, కానీ అసాధ్యం కాదని కనుగొన్నారు. చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం ప్రారంభంలో HKU5 యొక్క లినేజ్ 2 ఇప్పటికే మానవ ACE2 రిసెప్టర్‌లతో బంధం ఏర్పరచగల సామర్థ్యం కలిగి ఉందని గుర్తించారు.  అంటే ఇది మరింత ఉత్పరివర్తనాల అవసరం లేకుండానే మానవ కణాలను సోకగలదన్నమాట.  మెర్బెకోవైరస్ మొత్తాన్ని అధ్యయనం చేసి, ఇతర HKU5 వైరస్‌లు కూడా కొన్ని ఉత్పరివర్తనాల ద్వారా మానవులను సోకే సామర్థ్యాన్ని పొందవచ్చని గుర్తించారు.                 

HKU5 వైరస్‌లు మానవ కణాలను ఎలా సోకుతాయో మా అధ్యయనం చూపిస్తుందని సైంటిస్టుల ుఅంటున్నారు.   ఈ వైరస్‌లు మానవులకు వ్యాప్తి చెందడానికి కేవలం ఒక చిన్న దశ దూరంలో ఉన్నాయని మేము కనుగొన్నామని..  లినేజ్ 2 ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైనదిగా కనిపిస్తోందని హెచ్చరిస్తున్నారు. అంటే చైనా నుంచి మరో ప్రమాదకర కోవిజ్ వైరస్ వస్తోందన్నమాట.