corona cases: ఏపీలో కొత్తగా మరో రెండు వేల కేసులు నమోదు

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశం ఇవాళ కొత్తగా 39,742 మందికి కరోనా సోకింది.

ABP Desam Last Updated: 25 Jul 2021 05:07 PM
ap corona cases: ఏపీలో కొత్తగా 2వేల 252 కరోనా కేసులు నమోదు

ఏపీ కొత్తగా 2,252 కరోనా కేసులు నమోదయ్యాయి.  15 మరణాలు రిజిస్టర్ అయ్యాయి. చికిత్స పొందుతూ 2,440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 22వేల155. ఏపీలో 24 గంటల్లో 84వేల 858 మందికి కరోనా పరీక్షలు చేస్తే రెండు వేల రెండు వందల యాభై రెండు కేసులు వెలుగు చూశాయి. 
జిల్లాల వారీగా చూసుకుంటే కేసుల నమోదు, మరణాల్లో చిత్తూరు మొదటి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలో 293, నెల్లూరు జిల్లాలో 239 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 234, ప్రకాశం జిల్లాలో 223 కొత్తగా కరోనా కేసులు వెలుగు చూశాయి. చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడి చనిపోయారు. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. 

corona vaccine: కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌తో యాంటీబాడీస్ వృద్ధి

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ కరోనా వ్యాక్సిన్‌ మొదటి, రెండో డోసు మధ్య ఎక్కువ వ్యవధితో యాంటిబాడీలు, టీ సెల్‌ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ బాగా వృద్ధి చెందినట్టు బ్రిటన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సారథ్యంలో నిర్వహించిన ఈ పరిశోధనలో పలు ఇతర వర్సిటీల శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకున్నారు. రెండు డోసుల మధ్యకాలంలో యాంటిబాడీలు తగ్గినప్పటికీ రెండో డోసు తర్వాత పుంజుకున్నాయని తెలిపారు. టీ సెల్స్‌ మాత్రం రెండో డోసుల మధ్య నిడివిలో కూడా నిలకడగా ఉన్నాయని గుర్తించారు.

corona cases: ఆంధ్రప్రదేశ్‌కు 11లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు

ఆంధ్రప్రదేశ్‌కు మరో 11.76 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను శనివారం కేంద్రం పంపింది. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి వ్యాక్సిన్‌ డోసులు చేరాయి. ఆరోగ్యశాఖ అధికారులు వీటిని గన్నవరంలోని రాష్ట్ర వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఆయా జిల్లాలకు అవసరాలకు అనుగుణంగా వీటిని సరఫరా చేయనున్నారు. టీకాలు అందడంతో పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Background

దేశంలో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 39,742 మందికి వైరస్ సోకింది. 39వేల 972 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ వైరస్‌ కారణంగా 535 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు ౩కోట్ల 13లక్షల 71 వేల 901. ఇప్పటి వరకు 4,20,551 మంది చనిపోయారు. 3కోట్ల5 లక్షల 43వేల 138 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 లక్షల 8వేల 212 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 


దేశంలో ఇప్పటివరకు 45,37,70,580 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 42,67,799 డోసులు అందించినట్లు తెలిపింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.