ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఇరవై నాలుగు గంటల్లో 1679 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఎక్కువ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. అక్కడ 350 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. తర్వాత స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. అక్కడ 212 కేసులు రిజిస్టర్ అయ్యాయి. తర్వాత విశాఖ 128, చిత్తూరు జిల్లాలో 102, శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరంలో 11 కేసులు నమోదుయ్యాయి.
27,522 సాంపిల్స్‌ని పరీక్షించగా పదహారు వందల కేసులు వెలుగు చూశాయి. కరోనా కారణంగా చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 9, 598మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇప్పటి వరకు 3,27, 33, 046 సాంపిల్స్ పరీక్షించారు. ప్రస్తుతం ఏపీలో 46,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా యాక్టివ్ కేసులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అక్కడ 13731 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 7 రోజులుగా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
08-02-22 - 07.21%
07-02-22 - 08.58%
06-02-22 - 09.41%
05-02-22 - 11.38%
04-02-22 - 13.59%
03-02-22 - 15.06%
02-02-22 - 17.07%