వర్షాకాలం అంటే దోమల రాజ్యమనే చెప్పాలి. వాతావరణం చల్లగా ఉండటం వల్ల విపరీతంగా దోమల వ్యాప్తి జరుగుతుంది. మనం సరైన జాగ్రత్తలు పాటించకపోతే జ్వరాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాన్ సూన్ సీజన్లో రోగాల వ్యాప్తి, ఇన్ఫెక్షన్స్ మనల్ని తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తాయి. వర్షాకాలంలో వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి అధికంగా ఉంటుంది. దోమ కాటు వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, జికా వైరస్, వెస్ట్ వైరస్ తో పాటు అనేక అంటు వ్యాధులు వస్తాయి. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు చేరి ఉండటం వల్ల దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది.
దోమల వల్ల వచ్చే వ్యాధులు
*మలేరియా: జనాభాలో సగం మంది మాన్ సూన్ సీజన్లో మలేరియా బారిన పడతారు. అధిక జ్వరం, చలి, తల తిరగడం, ఒళ్ళు నొప్పులు, వాంతులు వంటివి మలేరియా సూచనలు.
* డెంగీ: కడుపులో నొప్పి, చిగుళ్ళలో రక్తం రావడం, శరీరం మీద దద్దుర్లు, జ్వరం, తల నొప్పి వంటివి డెంగీ లక్షణాలు. సరైన సమయానికి కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. .
* జికా వైరస్: చాలా మందిలో జికా వైరస్ లక్షణాలు తక్కువగానే ఉంటాయి. కొద్దిగా జ్వరం, జాయింట్ పెయిన్స్, కళ్ళు ఎర్రబడటం వంటివి ఈ వ్యాది లక్షణాలు. కానీ గర్బిణిలు, చిన్నపిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే చాలా ప్రమాదం.
* ఎల్లో ఫీవర్: కామెర్లు, శరీరం పాలిపోవడం, కళ్ళు పసుపు రంగులోకి మారితే అది ఎల్లో ఫీవర్ లక్షణాలుగా మనం గుర్తించాలి. ఎల్లో ఫీవర్ ని తగ్గించేందుకు ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
దోమల వ్యాప్తి ఎలా అరికట్టాలి?
ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే దోమల వ్యాప్తిని అరికట్టడం ఇక్కటే మార్గం. ఇంటా బయట దోమలు నశించే విధంగా క్రిమి సంహారక మందులు పిచికారి చేయాలి. శరీరం మొత్తం కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలి. సాయంత్రం వేళ బయటకి వెళ్ళకుండా ఉండటం మంచిది. ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు కిటికీలు వేసుకుని ఉండాలి. మీ ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పక్కన మురుగు నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
Also Read: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?