చల్లని చలికాలంలో వేడి వేడిగా ఏదైనా తింటే భలే బాగుంటుంది కదూ. అయితే, ఈ కాలంలో ఏది పడితే అది తినేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వద్దని, దానివల్ల రోగ నిరోధక శక్తి బలహీనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, మీరు రెగ్యులర్‌గా తీసుకొనే ఈ కింది ఆహారపానీయలకు సైతం ఈ కాలంలో దూరంగా ఉండటం మంచింది. అవేంటో చూసేయండి మరి.
వెచ్చవెచ్చని కాఫీ
చలి కాలంలో వెచ్చగా కాఫీ గొంతులోకి దిగుతుంటే చాలా బావుంటుంటుంది. ఎవరైనా కాఫీ ఆఫర్ చేస్తే వద్దని అనలేము. కానీ కాఫీ ఎక్కువ సార్లు తాగాలని అనిపించినపుడల్లా తాగడం మంచిది కాదని అంటున్నారు నిపుణులు, ఎందుకంటే ఇందులో కెఫిన్ ఉంటుంది, చలికాలంలో ముందు వాతావరణమే చాలా పొడిగా ఉంటుంది, అందుకు తోడు నీళ్లు ఎక్కువ తాగరు అందువల్ల డీహైడ్రేషన్ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంటుంది. వెచ్చదనం కోసం తరచుగా కాఫీ తాగితే అందులోని కెఫిన్ వల్ల శరీరం మరింత డీహైడ్రేట్ కావచ్చు. అందుకే వేడిగా కాఫీ తాగడం కంటే కాస్త వెచ్చగా నీళ్లు తాగడం మంచిది.
టమాట
టమాట లేకుండా వంట పూర్తి చెయ్యడం కష్టం. టమాట ఇష్టపడని వారు చాలా తక్కువ మంది. ఏ వంటకంలో నైనా ఇట్టే కలిసి పోయే టమాట అందరి ఫెవరేట్. అయితే వేసవి చివరి కాలంలో వచ్చే టమాటలు చాలా రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చలికాలంలో ఎర్రగా అందంగా కనిపిస్తాయి. కానీ అంత రుచిగా ఉండవు. శీతాకాలంలో టమాటాలు తినకపోవడమే మంచిది.
స్ట్రాబెర్రీ
వేసవితో పోలిస్తే చలికాలంలో స్ట్రాబెర్రీలు లేతగా ఉంటాయి. స్ట్రా బెర్రిలో ఫైటోన్యూట్రియెంట్స్ పరిమాణం దాని రంగు మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ రంగు అంటే ఎక్కువ పోషకాలు కలిగినది అని అర్థం. కనుక వీటిని వేసవిలో తినటమే మంచిది.
బేక్డ్ పదార్థాలు
కప్పు హాట్ చాక్లెట్ తో రెండు కుకీలు తినడం ఒక మంచి ఫీల్. కానీ చలికాలంలో సాచ్యూరేటెడ్ కొవ్వులను జీర్ణం చేసే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల శరరీంలో కొవ్వు పేరుకుంటుంది. చలికాలంలో జీవక్రియల వేగం కూడా నెమ్మదిస్తుంది. కనుక వీలైనంత వరకు బెక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.
మిరపకాయలు
చలికాలంలో స్పైసీ ఫూడ్ ఎంత రుచిగా అనిపిస్తుందో చెప్పలేం. బ్లాక్డ్ నోస్ తెరుచుకునేందుకు బాగా పనిచేస్తుంది. మిరపకాయలు సైనస్ లు క్లియర్ చేసేందుకు దోహదం చేస్తాయి. కానీ అవి కడుపుకు మంచివి కావు. చలి కాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. చలికాలం వెచ్చగా తినడం మంచిదే కానీ కారంగా మాత్రం కాదు. మిరపకాయలకు బదులుగా నల్ల మిరియాలు, అల్లం ఎక్కువగా వాడడం మంచిది.
ప్యాక్డ్ గ్రీన్స్
చలికాలం ఆకుకూరలు పుష్కలంగా దొరకుతాయి. అందుకే ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యదాయకం. తాజాగా దొరికే ఆకుకూరలనే వాడుకోవాలి. ముందుగా కడిగి, కోసి ప్యాక్ చేసిన ఆకుకూరలు వాడుకునేందకు సౌకర్యంగా ఉంటాయి కానీ వాటిలో పోషకాల నష్టం జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ప్యాక్డ్ కూరగాయలు కొనకపోవడమే మంచిది.
Also Read: వేడి నీళ్లతో స్నానం ప్రమాదకరమా? ఈ సమస్యలు వస్తాయ్, జాగ్రత్త!