రైన ఆహారం తీసుకుంటేనే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. లేదంటే జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడి పొట్టలో తీవ్రసమస్యలకు దారితీస్తుంది. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసుకుని అందులోని వ్యర్థాలను బయటకి పంపించడంలో గట్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రక్రియ సజావుగా లేకపోతే మలబద్ధకం, ఉబ్బరం, అతిసారం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ లక్షణాలు గట్ అనారోగ్యాన్ని సూచిస్తాయి. ఇవే కాదు మరికొన్ని పరోక్ష సంకేతాలు కూడా మీ గట్ చెడిపోతుందనే విషయం మీకు తెలియజేస్తాయి. ఈ సమస్యాత్మక లక్షణాలను గుర్తించడం చాలా కీలకం.


బరువు పెరగడం


జీవనశైలిలో మార్పులు లేకుండానే అమాంతం బరువు పెరిగిపోతారు. ఇది గట్ మైక్రోబయోమ్ వల్ల జరుగుతుంది. 2020 అక్టోబర్ లో జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం గట్ బ్యాక్టీరియా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దారితీస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారని వెల్లడించింది.


షుగర్ తినాలనే కోరిక


గట్ అనారోగ్యంగా ఉంటే అధికంగా చక్కెర తినాలనే కోరిక పుడుతుంది. స్వీట్లు, పండ్లు లేదా పాల ఉత్పత్తులు తినాలని ఎక్కువగా అనిపిస్తుంది. అధిక చక్కెర వినియోగం గట్ లో చెడు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. దీని వల్ల శరీరంలో మంటగా అనిపిస్తుంది.


ఆందోళన, నిరాశ


గట్, మెదడుకి మధ్య బలమైన బంధం ఉంటుంది. అందుకే గట్ ని రెండో మెదడుని అని అంటారు. పేగుల్లో నివసించే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు మెదడు మీద ప్రభావం చూపిస్తాయి. 2018 మేలో ఫ్రాంటియర్స్ ఇన్ సైకియాట్రీలో ప్రచురించబడిన సమీక్ష ప్రకారం గట్ సూక్ష్మజీవులు నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థతో కమ్యూనికేట్ అవుతాయి. ఇవి మానసిక స్థితి మీద ప్రభావితం అవుతాయి. దీన్ని పరిష్కరించడానికి ప్రీబయోటిక్స్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకుంటే గట్ మైక్రోబయోమ్ లను ప్రోత్సహిస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆహార విధానం పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు దోహదపడతాయి. కడుపులో మంట, చికాకుని తగ్గిస్తాయి.


అజీర్తి సమస్యలు


అజీర్తి సమస్యలు ఉంటే మీరు తీసుకున్న ఆహారం జీర్ణం చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గట్ మైక్రోబయోమ్ లో మార్పుల వల్ల అజీర్తి సమస్యలు ఏర్పడతాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. దీని వల్ల అతిసారం, పొత్తికడుపు తిమ్మిరి, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణశయాంతర సమస్యలు వాసత్యయి. కొన్ని వారాల పాటు పేగులను ఇబ్బంది పెట్టే ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది.


పేగులను ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు తినాలి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభించే ఉత్పత్తులని మెనూలో చేర్చుకోవాలి. గింజలు, నట్స్, బెర్రీలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, సిట్రస్ పండ్లు, గ్రీన్ టీ వంటివి తీసుకోవడం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే