ఒకప్పటిక కాలం వేరు. యాభై ఏళ్లు దాటాకే గుండె పోటు వంటి గుండె జబ్బు ప్రమాదాలు పొంచి ఉండేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. 21ఏళ్ల యువత కూడా గుండె పోటుతో మరణించిన సంఘటనలు వింటూనే ఉన్నాం. ఆధునిక కాలం అత్యాధునిక టెక్నాలజీతో పాటూ ఎన్నో అనారోగ్యాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా గుండె జబ్బులు త్వరగా పెరిగిపోతున్నాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేది ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత. మంచి ఆహారం తీసుకుంటూ రోజుకు అరగంట పాటూ వాకింగ్ చేసే వారిలో గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలి. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యలు పరోక్షంగా గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. గుండె పోటు రావడానికి ముందు గుండె పనితీరులో మార్పులు జరుగుతాయి. ఒక్కోసారి గుండె నెల రోజుల ముందు నుంచే కొన్ని రకాల లక్షణాలను చూపిస్తూ ఉంటుంది. మీకు ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే గుండె వైద్యులను కలిస్తే ప్రమాదం తప్పచ్చు. 


ఎలాంటి లక్షణాలు..
గుండె పోటు రావడానికి నెల రోజుల ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. వాటిని తేలికగా తీసుకుంటే చాలా కష్టం. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే...


1. గుండె కొట్టుకునే వేగంలో తేడా కనిపిస్తుంది. వేగంగా కొట్టుకుంటే అది మనకు తెలుస్తుంది. అప్పుడు వెంటనే వైద్యులను కలవాలి. 
2. ఏ పనిచేసినా, చేయకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంది. చిన్న చిన్న పనులకే ఆయాసం వస్తుంది. 
3. మానసిక ఆందోళన కూడా గుండె పోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది. మీకు గుండెల్లో గాభరాగా, దడగా లేదా పొట్టలో నొప్పితో గాభరా వస్తున్నా జాగ్రత్త పడాలి. 
4. గుండె సమస్యలు ఉన్నవారికి త్వరగా నిద్రపట్టదు. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాదు గుండెకు సమస్యగా ఉన్నా కూడా నిద్ర రాదు. ఎంతసేపు దొర్లినా నిద్ర రాకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. 
5. బీపీలో హెచ్చుతగ్గులు మంచి సూచన కాదు. హఠాత్తుగా బీపీ పెరిగినా కూడా అది గుండె పోటు సంకేతంగా భావించవచ్చు. 
6. వాతావరణం చల్లగా ఉన్నా కూడా కొందరికి చెమటలు పట్టేస్తాయి. అది గుండె పోటు లక్షణమే. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
7. ఛాతీలో సూదితో గుచ్చుతున్నట్టు నొప్పి వస్తున్నా కూడా గుండె పోటేమో అని అనుమానించాలి. ఈ నొప్పి కొంతకాలం పాటూ వచ్చి పోతే... తగ్గిపోయిందా కదా అనుకోవద్దు. 
8. పొత్తి కడుపులో నొప్పి వచ్చి పోతుండడం, పట్టలో గ్యాస్ ప్రాబ్లెమ్ అనిపించడం కూడా గుండె సమస్యకు సంకేతమే. 
9. గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించడం కూడా గుండె సమస్య లక్షణమే. 
పైన చెప్పిన లక్షణాలన్నీ కూడా గుండె పోటుకు చెందినవే. 


గుండెపోటు వచ్చిన వారిలో ఆసుపత్రికి వెళ్లాక మూడు నుంచి 8 శాతం మంది మాత్రమే బయటపడుతున్నట్టు అంచనా. నలభై అయిదేళ్లు దాటి మహిళలతో పోలిస్తే పురుషుల్లో అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. 



Also read: డయాబెటిస్ ఉన్నవారు వారానికి రెండుసార్లు ముల్లంగి తింటే చాలు, అదుపులో ఉండడం ఖాయం













































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.