ABP Desam Health Conclave 2024 Health for All : ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పిస్తూ.. వారి సందేహాలను తీర్చాలనే ఉద్దేశంతో ఏబీపీ దేశం వినూత్నంగా హెల్త్ కాన్ క్లేవ్ 2024ని నిర్వహిస్తుంది. బంజారాహిల్స్‌లోని రాడిషన్ బ్లూ ప్లాజా వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. రేపు ఉదయం(26-07-2024) పది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఏబీపీ నిర్వహిస్తున్న ఈ హెల్త్ కాన్ క్లేవ్ 2024 ఈవెంట్‌కు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజర్ కానున్నారు. Health for All అనే ఉద్దేశంతో దీనిని ఏబీపీ దేశం వినూత్నంగా నిర్వహిస్తుంది.
హైదరాబాద్‌లోని నలుమూలల నుంచి హెల్త్ కాన్ క్లేవ్ కోసం వైద్యులు రానున్నారు. వివిధ అంశాలపై అవగాహన ఇవ్వనున్నారు. వైద్య విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ హెల్త్ కాన్ క్లేవ్కి ఎవరైనా హాజరుకావొచ్చు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలు ఉన్నా.. వైద్యులను అడిగి తెలుసుకోవచ్చు. కేవలం శారీరక సమస్యలకే కాకుండా.. మానసిక సమస్యలపై కూడా హెల్త్ కాన్ క్లేవ్లో అవగాహన కల్పించనున్నారు. బిజీ లైఫ్‌లో చాలామంది తమ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. శారీరకంగానే కాకుండా.. మానసికంగానూ బలహీనంగా మారుతున్నారు. ఈ సందర్భంలో ఈ హెల్త్ కాన్ క్లేవ్‌ను ఉపయోగించుకుని.. ఆరోగ్యంపై అవగాహన తెచ్చుకోవాలని కోరుతుంది ఏబీపీ దేశం.