మిగతా కాలలతో పోల్చుకుంటే వర్షాకాలం చాలా మందిని అనారోగ్యం పాలు చేస్తుంటుంది. సీజనల్‌గా వచ్చే వ్యాధులతోపాటు మిగతా సమస్యలు కూడా వెంటాడుతాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది జుట్టు ఊడిపోవడం. చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు. జుట్టు జిడ్డుగా అయిపోతుంటుంది. చండ్రు కూడా చేరుతుంది. 


ఇలాంటి సమస్య నుంచి బయట పడేందుకు మార్కెట్‌లో చాలా రకాలైన ఆయిల్స్‌, హెయిర్ మాస్క్‌లు దొరుకుతున్నాయి. కానీ ఇవి అందరికీ అందుబాటులో ఉండేవి కావు. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు సురక్షితంగా ఉంటుంది. 


చిన్న చిన్న ఆహార నియమాలు పాటిస్తే చాలు మీ జుట్టు ఒత్తుగా ఉంటుంది. ముందుగా మీ శరీరంలో విటమిన్లు, మినరల్స్ సరిపడా ఉండేలా చూసుకోవాలి. ఇవే మీ జుట్టును దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతాయి.  దీని కోసం కొన్ని ఆహార సర్దుబాట్లు చేసుకోవడం మంచిది. తద్వారా మీరు బలమైన విటమిన్లు, మినరల్స్ పొందగలరు.


జుట్టు రాలిపోకుండా పాటించాల్సిన ఐదు నియమాలు


గుడ్లు: గుడ్లు ప్రోటీన్, బయోటిన్ ఎక్కువ దొరికే ఫుడ్. ఇది జుట్టు కుదుళ్లను గట్టిగా చేస్తుంది. జుట్టులో కొల్లాజెన్ మొత్తాన్ని పెంచుతాయి. ఉదయాన్నే మీరు తీసుకునే బ్రేక్‌ ఫాస్ట్‌లో ఎగ్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. 


మెంతి గింజలు: మెంతి గింజల్లో ఇ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెంతి గింజలను  రాత్రిపూట నానబెట్టి.. ఉదయాన్నే వడకట్టి వీలున్నప్పుడల్లా ఆ నీటిని తాగితే మీ జుట్టుకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. 


బాదం, వాల్‌నట్‌లు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వాల్‌నట్‌లు, బాదంపప్పులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు తేమను స్టేబుల్‌గా ఉంచి జుట్టు రాలిపోకుండా చూసే ఆహార పదార్థాల్లో ఈ రెండు ఉత్తమమైనవి. ప్రతి రోజు ఈ గింజలను గుప్పెడు తింటే తర్వాత వచ్చే ఫలితాన్ని మీరే చూస్తారు. 


బచ్చలి కూర: ఐరన్, ఫోలేట్, విటమిన్లు బచ్చలి కూరలో పుష్కలంగా లభిస్తాయి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. పాలకూర లాంటి ఇతర కూరలను కూడా మీ ఫుడ్‌లో చేర్చుకోండి. 


నేరేడు పండ్లు : వర్షాకాలంలో లభించే నేరేడు పండులో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఇది కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ మాడును బలపరుస్తుంది. నేరేడుు పండుగా తినొచ్చు లేదా వేరే మార్గాల్లో కూడా ఆరగించవచ్చు. 


ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు సురక్షితంగా ఉంటుంంది.