Fact Check:   ఏంటీ.. అది ఘటోత్కచుడి కత్తా…? నిజంగానే దొరికిందా..?

పురావస్తు తవ్వకాల్లో భారీ కత్తి బయటపడింది అని, అది ఘటోత్కచుడి ఉనికిని సూచిస్తుంది అని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Continues below advertisement

 

Continues below advertisement

Claim: చిత్రంలో కనిపిస్తున్నది పురావస్తు తవ్వకాల్లో దొరికిన భారీ కత్తి, అది ఘటోత్కచుడి ఉనికిని సూచిస్తుంది

Fact: ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ అవుతున్న ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించబడింది

Hyderabad: ఒక పురావస్తు ప్రదేశంలో ఒక భారీ కత్తి దొరికింది అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం షేర్ చేస్తూ గుర్తు తెలియని పురావస్తు ప్రదేశంలో ఈ కత్తిని కనుగొన్నారని క్లెయిమ్ చేశారు.

ఫేస్‌బుక్‌లో ఈ ఫోటోని షేర్ చేస్తూ, "తెలియని పురావస్తు ప్రదేశంలో కనుగొనబడిన ఒక భారీ కత్తి, దాని పరిమాణం ,సంక్లిష్టమైన డిజైన్ కారణంగా అది ఘటోత్కచుడు ఉనికిని సూచిస్తుంది," అని క్యాప్షన్‌లో రాశారు. ఈ పోస్టుని ఏడు లక్షల మందికి చూశారు, ఎనిమిది వేలకుపైగా లైకులు వచ్చాయి. (ఆర్కైవ్)


Fact Check:

వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ అవుతున్న చిత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించబడింది.

వైరల్ అవుతున్న చిత్రంలో ఉన్న కత్తిని పురావస్తు శాఖ కనుగొన్నారు అని చూపిస్తున్న కథనాలు ఏ కీ వర్డ్ సెర్చ్ ద్వారా దొరకలేదు. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి విశ్వసనీయ సమాచారం, ఫోటోలు లేదా వీడియోలు కనిపించలేదు.

వైరల్ చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మరింత సమాచారం అందించే సంబంధిత దృశ్య సరిపోలికలు కనిపించలేదు. అయితే ఇదే ఫోటో వివిధ భాషల్లో క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని కనుగొన్నాం. జాపనీస్, అరబిక్ (లింక్ 1లింక్ 2), రష్యన్, ఇంగ్లీష్ (లింక్ 1లింక్ 2లింక్ 3), హిందీస్పానిష్టర్కిష్ వంటి భాషలో ఉన్న క్లెయిమ్స్ కనుగొన్నాం.

ఈ పోస్టులలో కనిపిస్తున్నది అబ్రహమిక్ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలో ప్రస్తావించబడిన ఆదాముకి చెందిన కత్తి యెమెన్ దేశంలో దొరికిందని ఒకరు క్లెయిమ్ చేస్తే, రష్యాకు చెందిన ఇలియా మురోమెట్స్ కత్తిని రష్యా పురావస్తు శాఖ కనుగొందని ఇంకొకరు రాశారు.

అయితే వైరల్ అవుతున్న పోస్టులు అన్నింటిలో 'పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డ భారీ కత్తి, ఇది భారీ దేహాలు ఉన్న మానవుల ఉనికిని సూచిస్తుంది' అని క్లెయిమ్ చేయడం చూడగలం.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి, తవ్వకం జరుగుతున్న ప్రదేశం చుట్టూ లైటింగ్, నీడలలో అసమానతలు ఉన్నాయి. సాధారణంగా ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలే అలా ఉంటాయి.

కాబట్టి, ఈ చిత్రాన్ని ఏఐతో రోపొందించారేమో అని Wasitai అనే ఏఐ అప్లికేషన్స్‌ గుర్తించే టూల్ ఉపయోగించాము. Wasitai ఈ చిత్రం లేదా దానిలోని ముఖ్యమైన భాగాన్ని ఏఐ ద్వారా సృష్టించారని నిర్ధారించింది.

Sight Engine అనే మరొక ఏఐ అప్లికేషన్ గుర్తించే టూల్ ద్వారా ఈ చిత్రాన్ని పరిశీలించాం. 74 శాతం ఏఐ ఉపయోగించి తయారు చేసి ఉండే అవకాశం ఉంది అని ధృవీకరించింది.

వైరల్ అవుతున్న చిత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించబడింది. కాబట్టి, ఈ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review:చిత్రంలో కనిపిస్తున్నది పురావస్తు తవ్వకాల్లో దొరికిన భారీ కత్తి, అది ఘటోత్కచుడి ఉనికిని సూచిస్తుంది

Claimed By:Social Media Users

Claim Reviewed By:NewsMeter

Claim Source:Social Media

Claim Fact Check:False

Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ అవుతున్న ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించారు.

This story was originally published by Newsmeter as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.

 

 

Continues below advertisement