Fact Check On Sakshi And Eenadu Posts Gone Viral: ఈ నెల 13న ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిశాయి. అంతకు ముందు రాష్ట్రవ్యాప్తంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి ప్రచారం జోరుగా నిర్వహించింది. భారీగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ ముందు సాక్షి పేపర్ లో వచ్చిన కథనం 'మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే, కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు' అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు, ఎన్నికలు పూర్తైన తర్వాత ఈనాడు ప్రచురించినట్లుగా.. 'ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ సంస్థల సర్వేలు - అన్ని సర్వేల్లో వైకాపా వైపు ప్రజల మొగ్గు' అంటూ ఇంకో కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇవి రెండూ ఫేక్ అని 'న్యూస్మీటర్' నిర్ధారించింది.
నిజ నిర్ధారణ:
సాక్షి, ఈనాడు పేరిట వచ్చిన న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలు ఫేక్ అని, సదరు వార్తా సంస్థలు అలాంటి ప్రకటనలేవీ చేయలేదని న్యూ
సాక్షి పేరుతో ఫేక్ వార్త..
తర్వాత సాక్షి పేరుతో వైరల్ అవుతోన్న ఫ్రంట్ పేజీకి సంబంధించి, తాము సాక్షి కార్యాలయాన్ని సంప్రదించామని.. అది నకిలీదని వారు ధ్రువీకరించినట్లు 'న్యూస్మీటర్' తెలిపింది. అంతేకాకుండా, సాక్షి దినపత్రికలో ఈ వైరల్ ఫ్రంట్ పేజీ ఉందా లేదా అని వెతికినప్పుడు, అసలు ఈ వైరల్ మొదటి పేజీ కనిపించలేదని నిర్ధారించింది.
దీంతో ఏపీకి సంబంధించి సాక్షి, ఈనాడు పేరిట సర్క్యులేట్ అవుతోన్న ఈ న్యూస్ పేపర్స్ ఫ్రంట్ ఫేజీలు ఆ సంస్థలు ప్రచురించలేదని 'న్యూస్మీటర్' స్పష్టం చేసింది.
This story was originally published by Newsmeter, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.