Factly Clarity On Pawan Kalyan Nomination Rally False Video: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 23న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై 'ఫ్యాక్ట్ లీ' స్పష్టత ఇచ్చింది.
క్లెయిమ్: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 2019, నవంబర్ 3న ఏపీ ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరతకు నిరసనగా జనసేన పార్టీ విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కు సంబంధించినవి. దీంతో సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఈ వీడియో తప్పుడు వీడియోగా నిర్ధారితమైంది.
అసలు నిజం ఏంటంటే?
జనసేన పార్టీ 2019, నవంబర్ 4న తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 'Aerial View | JanaSena Party Long March at Visakhapatnam Against YSRCP Sand Policy | Pawan Kalyan' అనే శీర్షికతో పబ్లిష్ చేసింది. ఈ వీడియో 03 నవంబర్ 2019న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా ఏపీలో ఏర్పడిన ఇసుక కొరతకు నిరసనగా ఆ పార్టీ విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించినదిగా 'ఫ్యాక్ట్ లీ' స్పష్టం చేసింది. ఈ లాంగ్ మార్చ్ వీడియోను ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేసిన సందర్భంగా జరిగిన ర్యాలీ వీడియో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిర్ధారించింది. ఆ వీడియో లాంగ్ మార్చ్ కు సంబంధించిన వీడియో అని స్పష్టత ఇచ్చింది.
This story was originally published by Factly.in as part of the Shakti Collective. This story has been Edited ABP Desam staff.