Fact Check Andhra Pradesh :  ఆంద్రప్రదేశం లో ఏం జరిగినా రాజకీయమే అవుతోంది. సోషల్ మీడియా సైన్యాలు విచ్చలవిడిగా ఫేక్ న్యూస్‌లు సర్క్యూలేట్ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఫోటోలతో పాస్ బుక్కులు ఇస్తున్నారని కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను పోస్టు చేసి వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రభుత్వాన్ని , టీడీపీ నేతల్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో జగన్ బొమ్మ వేస్తే విమర్శించారని ఇప్పుడు ఎందుకు ఇలా బొమ్మలు వేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. 



Fact Check Andhra Passbook : 


క్లెయిమ్ ఏమిటి ?


మీ భూమల పట్టాల మీద చంద్రబాబు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వేస్కుంటున్నారు!.  అంటే చంద్రబాబు జగన్ గారి మీద చెప్పినట్లు, ఇప్పుడు మీ భూములు లాకునే పని సిద్ధం చేస్తున్నారా ప్రజలారా? అని జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే అకౌంట్ ద్వారా ఫ్రశ్నించారు. దాన్ని ఇక్కడ చూడవచ్చు. 



తర్వాత అనేక వైసీపీ సోషల్ మీడియా సానుభూతి పరుల అకౌంట్లలోనూ కనిపించింది. ఆ ఫోటోలను చూపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 


ఇక్కడ            ఇక్కడ


అసలు వివాదం ఏమిటి ?


వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. అది భూములు లాగేసుకోవడానికి తెచ్చిన చట్టం అని టీడీపీ ప్రచారం చేశారు. పాస్ బుక్‌లపై జగన్ ఫోటోలు ఉండటం కూడా వివాదాస్పదమయింది. ఇటీవల చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. ఇప్పుడు చట్టం లేదు. జగన్ ఫోటోలతో ఇచ్చిన పాస్ బుక్‌లను రీప్లేస్ చేస్తామని ప్రకటించారు. 


అయితే అలా చేసిన చంద్రబాబు ఇప్పుడు తన ఫోటోలు వేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 



మా పరిశీలన ఏమిటి ?
 
ప్రభుత్వం కొత్త పాస్ బుక్‌లు ఇంకా జారీ చేయలేదు. ఎలాంటి పాస్ బుక్కులపై కొత్తగా ప్రభుత్వ నేతల ముద్రలు వేయడం లేదు. ప్రభుత్వానికి సంబంధించి వివిద పౌరసేవలు అందించే పత్రాల్లో సహజంగానే ప్రభుత్వాధినేత ఫోటో ఉంటుంది. ఆ కోణంలో భూములవివరాలతో కూడిన పత్రాన్ని పొందారు. కానీ ఆ పత్రంపై చంద్రబాబుతో పాటు రెవిన్యూ మంత్రి ఫోటోషాప్ చేసినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. ప్రభుత్వ లోగో మీ భూమి అనే పేరు కింద పైనా గ్యాప్ ఉండటంతో చంద్రబాబుతో పాటు , రెవిన్యూ మంత్రి ఫోటోలను ఫోటో షాప్ చేశారు. 



టీడీపీ క్లెయిమ్ !


ఫేక్ ఫోటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ కూడా మండిపడింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా స్పష్టత ఇచ్చింది. 


ఇక్కడ


కంక్లూజన్


కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాస్ బుక్‌లను ముద్రణ ఇంకా చేపట్టలేదు. పాస్ బుక్కులపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఫోటోలు ప్రచురించడం ఫేక్. మిస్లీడింగ్. 



This story was originally published by ABP Desam as part of the Shakti Collective.