Fact Check :  యాత్ర 2 సినిమా రిలీజవక ముందే ప్రభుత్వం ఆ సినిమాను ప్రమోట్ చేస్తోందంటూ ఓ జీవో రిలీజ్ అయింది. ఆ జీవో రాజకీయంగానూ కలకలం రేపింది.  జీవోలో ఏముందంటే..యాత్ర-2 సినిమాకు థియేటర్ల ఫుల్‌ ఉండేలా చూడాలని..ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసినట్లు ఓ ఫేక్‌ జీవో తయారు చేశారు. ఫస్ట్ రెండు రోజులు ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సినిమా చూసేలా ఆదేశాలు జారీ చేయాలని ఈ జీవోలో పేర్కొన్నారు. వాలంటీర్లు సైతం సంక్షేమ పథకాలు పొందుతున్న పది మందిని థియేటర్లకు తరలించేలా చూడాలని ఈ జీవోలో ఉంది. విలేజ్‌ వాలంటీర్ ఒక్కొక్కరికి పది టికెట్లు కేటాయించేలా థియేటర్ ఓనర్లతో కలెక్టర్లు మాట్లాడాలలన్నట్లుగా ఆదేశాలు ఉన్నాయి.                                   

  





 జీవోలో అంతా బానే మేనేజ్ చేసినప్పటికీ..అసలు సీఎస్‌ ఎవరనే విషయంలో  తప్పు చేశారు. మాజీ సీఎస్ నీలం సాహ్ని పేరుతో ఈ జీవో తయారు చేశారు. కానీ నీలం సాహ్ని 2020 డిసెంబర్‌ 31నే ఏపీ చీఫ్‌ సెక్రటరీగా రిటైర్‌ అయ్యారు. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా జవహర్‌ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ కారణంగా ఇది ఫేక్ అని సులువుగానే గుర్తు పడుతున్నారు. కానీ ఆ జీవోలో ఉన్న మ్యాటర్ చూసి టీడీపీ సానుభూతి  పరులు విమర్శలు గుప్పిస్తున్నరు. ఈ జీవో చూస్తే నిజమే అనుకుంటారంతా. కానీ ఫ్యాక్ట్‌చెక్‌లో ఈ జీవో తప్పని తేలింది. ఈ జీవో అడుగున ఛీఫ్ సెక్రటరీగా నీలం సహానీ పేరుండటంతో ఫేక్ జీవో అని తేలిపోయింది.  


ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ రాజకీయాల్లో ఫేక్ న్యూస్ , ఫేక్ వార్తలు వైరల్ అయిపోతున్నాయి. రెండు రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా సైన్యాన్ని నడుపుతూండటంతో  ఎవరికి వారు ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ స్పెడ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ కి వెళ్లక ముందే అమిత్ షా తో భేటీ అయినట్లుగా ఆయన కాళ్లకు నమస్కారం చేసినట్లుగా ఫేక్ ఎడిట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే టీడీపీ వైపు నుంచి కొన్ని వైసీపీకి వ్యతిరేకంగా ఫేక్‌లు వైరల్ అవుతున్నాయి. ఎవరు సృష్టిస్తారో కానీ.. ఆ ఫేక్ ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది.