Yatra 2 teaser movie release date: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తీసిన సినిమా 'యాత్ర'. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా... ప్రస్తుత ఏపీ సీఎం, వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర, ఆయన జీవితంలో ముఖ్యమైన కీలకమైన మలుపుల ఆధారంగా తీస్తున్న సినిమా 'యాత్ర 2'. ఫిబ్రవరి 8న సినిమా విడుదల కానుంది. 'యాత్ర' చిత్రాన్ని 2019లో ఫిబ్రవరి 8న విడుదల చేశారు. సేమ్ డేట్‌కి సీక్వెల్ వస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.
జనవరి 5న 'యాత్ర 2' టీజర్!
'యాత్ర' సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి నటించారు. 'యాత్ర 2' సినిమాలో మరోసారి ఆ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇక, జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన జీవా నటిస్తున్నారు. మమ్ముట్టి, జీవా తండ్రీ కొడుకులుగా నటిస్తుండటం ఇదే తొలిసారి. ఈ సినిమా టీజర్ జనవరి 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇవాళ వెల్లడించింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు టీజర్ యూట్యూబ్ లోకి రానుంది.
Also Read: బెల్లంకొండ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్, అభిమానం చూపించిన దర్శకుడు?
'యాత్ర 2' టీజర్, ట్రైలర్ ఎప్పుడో రెడీ అయ్యాయి. డిసెంబర్ 21న... అంటే జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు కానుకగా టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఏమైందో ఏమో... ఆ రోజు పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ కానుంది. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక 'యాత్ర 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సోనియా గాంధీగా జర్మన్ నటి సుజానే!
'యాత్ర 2'లో సమకాలీన రాజకీయ ప్రముఖుల ప్రస్తావన సైతం ఉండబోతోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో ఉత్తరాది నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారు.
Also Read: యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ vs సింగర్ సునీత కొడుకు ఆకాష్... ఇద్దరిలో ఎవరు బెటర్?
వైయస్సార్ మరణం తర్వాత తెలుగు గడ్డపై జరిగిన రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పేరు బలంగా వినిపించింది. ఆమె పాత్రను ఎలా చూపిస్తున్నారు? అనేది సినిమా విడుదలైతే తప్ప చెప్పలేం! జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ (Suzanne Bernert) ఫస్ట్ లుక్ చూస్తే... అచ్చం సోనియా గాంధీలా ఉన్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. హిందీ నటుడు, ఈ ఏడాది మరణించిన అఖిల్ మిశ్రా భార్య సుజానే. సుమారు 20 ఏళ్ళ నుంచి భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్, సీరియళ్లు చేస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి సినిమా 'యాత్ర 2'.